Krishnapatnam Medicine: కృష్ణపట్నం కరోనా మందుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జనం పోటెత్తడం, పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సిన నేపధ్యంలో మందు పంపిణీని నిలిపివేశారు. అధ్యయం పూర్తయితే వారంలో తిరిగి ప్రారంభం కానుంది.
కరోనా మహమ్మారి (Corona pandemic) నియంత్రణలో ప్రపంచం మొత్తం తలకిందులవుతున్నవేళ..ఏపీ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం కరోనా మందు చర్చనీయాంశమవుతోంది. మూడ్రోజుల విరామం అనంతరం తిరిగి ప్రారంభం కావడంతో ఒక్కసారిగా జనం పోటెత్తారు. మరోవైపు మందు శాస్త్రీయతపై సందేహాల నేపధ్యంలో నివృత్తి చేసేందుకు వైద్య బృందాలు రంగంలో దిగాయి. పూర్తి స్థాయి అధ్యయనం తరువాతే అనుతిచ్చేందుకు తాత్కాలికంగా మందు పంపిణీని నిలిపివేశారు. ఆనందయ్య ఆయుర్వేద మందు(Anandaiah Ayurveda mandu)పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి..పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆయుష్ కమీషనర్ రాములు ఆధ్వర్యాన అధ్యయనం కొనసాగుతోంది. ఇవాళ ఆయన ఎదురుగా ఆయుర్వేద మందును తయారు చేసి చూపించనున్నారు. పూర్తిస్థాయి అధ్యయనం పూర్తయితే తిరిగి మందు పంపిణీకు అనుమతి ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రాధమిక దర్యాప్తులో ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేవని తేలింది.
మరోవైపు ఐసీఎంఆర్ (ICMR) బృందం కూడా కృష్ణపట్నంకు చేరుకుంది. ఐసీఎంఆర్ బృందం కూడా పరిశోధన చేసిన తరువాత మందు శాస్త్రీయతపై నిగ్గు తేలనుంది. ఏ వైద్య బృందాలు ఏం తేల్చినా ప్రజల్లో మాత్రం కరోనా మందుపై మంచి అభిప్రాయం నెలకొంది. కరోనా బారినపడిన రోగులు ఈ మందుతో కోలుకుంటున్నారు. ఆక్సిజన్ పూర్తి స్థాయిలో పడిపోయిన రోగులు సైతం ఆనందయ్య మందుతో లేచి కూర్చుంటున్న పరిస్థితి ఉంది. అందుకే ఒక్కసారిగా కృష్ణపట్నం మందు(Krishnapatnam medicine)కు అంత క్రేజ్, డిమాండ్ ఏర్పడింది. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని..పూర్తి స్థాయి అధ్యయనం తరువాత మందు పంపిణీ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంది.
Also read; Krishnapatnam medicine: కృష్ణపట్నం మందుకు దేశవ్యాప్తంగా డిమాండ్, రంగంలో వైద్య బృందాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Krishnapatnam Medicine: కృష్ణపట్నం మందు బ్రేక్, పూర్తి స్థాయి అధ్యయనంతోనే అనుమతి