Krishnapatnam medicine: కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న వేళ కృష్ణపట్నం మందు కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు దివ్యౌషధంగా పనిచేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. కృష్ణపట్నంలో మందు కోసం జనం పోటెత్తుతున్నారు.
కరోనా వైరస్ (Corona Virus) నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా మందు కనుగొనే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యాక్సిన్ కొరత ఓ వైపు, మరోవైపు వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకుతుండటం వంటి కారణాలతో ప్రత్యామ్నాయ చికిత్స కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు. లక్షలు గుంజుతూ కూడా కార్పొరేట్ వైద్యం ప్రాణాలు కాపాడలేనప్పుడు..పైసా ఖర్చు లేకుండా, దుష్పరిణామాల్లేని మందు ఇస్తానంటే ప్రయత్నించడంలో తప్పేంటనే ప్రశ్న వస్తోంది. అదే ఇప్పుడు కృష్ణపట్నం మందుకు (Krishnapatnam Medicine) అంతటి డిమాండ్‌కు కారణమైంది.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణపట్నంలో అనాదిగా ఆయుర్వేద వైద్యం చేస్తున్న ఆనందయ్య (Anandaiah) ఇప్పుడు అందరికీ చర్చనీయాంశమయ్యారు. కారణం అతనిస్తున్న మందు కరోనాను నయం చేస్తుండటమే. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువున్నవారు కూడా ఆనందయ్య మందుతో లేచి నిలుచుంటున్నారు. అల్లోపతి వైద్యులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండ్రోజుల్లో మెరుగుపడుతున్నాయి. ప్రకృతిలో లభించే వివిధ రకాల ఆకులు, అలములతో స్వయంగా తయారు చేసి అందరికీ ఉచితంగా అందిస్తున్న ఆనందయ్య అందరకీ దేవుడిలా కన్పిస్తున్నాడు. శాస్త్రీయంగా నిర్ధారణ కాకపోయినా..మందు మాత్రం పనిచేస్తోంది. ఎటువంటి దుష్ఫరిణామాలు ఇప్పటి వరకూ లేవని స్వయంగా రోగులు, స్థానిక ప్రజలు చెబుతున్నారు. దాంతో కృష్ణపట్నం కరోనా మందు( Krishnapatnam corona mandu) దేశవ్యాప్తంగా ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ పొరుగున ఉన్న రాష్ట్రాల్నించి పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.
మూడ్రోజుల విరామం అనంతరం శుక్రవారం మరోసారి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది. ఒక్కసారిగా జనం పోటెత్తారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మందు పంపిణీ ప్రారంభించారు. ఇప్పుడు అందరి దారి కృష్ణపట్నంవైపే ఉంటోంది. ఉచితంగా ఇస్తున్నారని కాదు గానీ..ఆనందయ్య మందు కరోనాను నయం చేస్తుందన్న ప్రచారం, వాడిని వారి అభిప్రాయాలతో ప్రాచుర్యంలో వచ్చింది. అందుకే ఇప్పుడు అందరి నోటా కృష్ణపట్న మందు హాట్ టాపిక్‌గా మారింది. ప్రారంభించిన రెండు మూడు గంటల వ్యవధిలోనే మందు ఆయిపోవడంతో జనం నిరాశగా వెనుదిరిగారు. ఈలోగా మందు శాస్త్రీయతను నిర్ధారించేందుకు ఆయుష్(Ayush), ఐసీఎంఆర్(ICMR) వైద్య బృందాలు కృష్ణపట్నం చేరుకున్నాయి. పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్ర నివేదికను అందించనున్నాయి.
Also read: AP COVID-19 report: ఏపీలో 24 గంటల్లో కరోనాతో 104 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook