Bhuvneshwar Kumar's father died: మీరట్: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ ఇక లేరు. ఏడాది కాలంగా కాలేయ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో (Liver cancer) బాధపడుతూ చికిత్స పొందుతున్న కిరణ్ పాల్ సింగ్ గురువారం సొంత నివాసంలోనే కన్నుమూశారు. ప్రస్తుతం కిరణ్ పాల్ వయస్సు 63 ఏళ్లు. గతేడాది భువి దుబాయ్‌లో ఐపిఎల్ ఆడుతుండగా కిరణ్ పాల్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు క్యాన్సర్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచే క్యాన్సర్‌కి చికిత్స పొందుతున్నారు.
Also read : IPL 2021: ఐపీఎల్ నిర్వహణపై చిగురిస్తున్న ఆశలు, అన్నీ కుదిరితే ఈసారి కొత్త వేదికలో టీ20 టోర్నీ
లివర్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా నొయిడాలో కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న కిరణ్ పాల్ సింగ్ ఇటీవలే మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో అందరితో కలిసి ఉంటున్న సమయంలోనే ఇలా ఆయన తుదిశ్వాస విడిచారు. ఉత్తర్ ప్రదేశ్ పోలీసు శాఖలో సేవలు అందించిన కిరణ్ పాల్ సింగ్ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం భువి కూడా ఇంటి వద్దే ఉన్నాడు. తండ్రి కిరణ్ పాల్ మృతితో భువనేశ్వర్ (Bhuvneshwar Kumar) ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook