Black Fungus:కరోనా మహమ్మారితో పాటు సమాంతరంగా భయపెడుతోంది భ్లాక్ ఫంగస్. అరుదుగా వచ్చే ఈ ఫంగస్ ...కోవడ్19 వైరస్ కారణంగా మరింత ప్రమాదకంరగా మారుతోంది. మాహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ భారీగా ప్రాణాలు తీస్తోంది.
కరోనా వైరస్ (Corona virus) ముప్పుతో పాటు ఇప్పుడు దేశాన్ని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు పొంచి ఉంటోంది. అరుదుగా వచ్చే ఈ మ్యూకోర్మైకోసిస్ ( Mucormycosis) ఫంగస్ ప్రమాదకరమైనదేనని నిపుణులు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) ధాటికి అల్లకల్లోలమైన మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ఇప్పటి వరకూ 52 మంది ప్రాణాలు తీసినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.కరోనా నుంచి కోలుకున్న లేదా కోలుకుంటున్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు.
ఈ ఫంగస్ సోకితే తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, ముక్కు మూసుకుపోవడం, పాక్షికంగా చూపు కోల్పోవడం వంటివి ప్రధానంగా కన్పించే సమస్యలు. మహారాష్ట్ర(Maharashtra)లో మ్యూకోర్మైకోసిస్ వల్ల మరణించిన 52 మంది కరోనా నుంచి కోలుకున్నవారే కావడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్య శాఖ తొలిసారిగా బ్లాక్ ఫంగస్ (Black Fungus) మృతుల జాబితాను బయటపెట్టింది. రాష్ట్రంలో 15 వందల వరకూ బ్లాక్ ఫంగస్ కేసులున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు యాంఫోటెరిసిన్–బి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ ఫంగస్ కారణంగా ఇప్పటికే 8 మంది చూపు కోల్పోయినట్టు అధికారులు గుర్తించారు.
Also read: Sputnik V Vaccine Cost: రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ధర ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరిస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook