Wine Shops In Telangana : కరోనా సెకండ్ వేవ్‌లో మహమ్మారి నియంత్రణకు ఇదివరకే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్డౌన్ బాట పట్టాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సైతం లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో 10 రోజులపాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 12 నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ అమలులో ఉండనుంది. ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు నాలుగు గంటలపాటు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది.
లాక్డౌన్ ప్రకటన రాగానే తెలంగాణలో మందుబాబులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులపాటు లాక్డౌన్ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. లాక్డౌన్ (Telanagana Lockdown) సమయంలో మద్యం దుకాణాలను సైతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖ(Excise Department)కు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ సాయంత్రం కాగానే మద్యం దుకాణాల ముందు వాలిపోయే మందుబాబులు ఈ లాక్డౌన్ సమయంలో తెల్లారగానే వైన్స్‌షాపుల ముందు ప్రత్యక్షమవుతారు.
Also Read: Telanagana Lockdown: తెలంగాణలో రేపటి నుంచి పదిరోజుల పాటు లాక్డౌన్
తెలంగాణ వ్యాప్తంగా అబ్కారీ కార్యాలయాలు సైతం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. లాక్డౌన్లో ఆదాయం తగ్గకుండా చర్యలలో భాగంగా నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యావసర సరుకులు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచాలని సూచించింది. సాధారణంగా ఉదయం 10 గంటల తరువాత తెరుచుకోనున్న తెలంగాణ(Telangana) మద్యం దుకాణాలు లాక్డౌన్ కాలంలో 10 గంటలకు మూత పడనుండటం గమనార్హం.
Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు, త్వరలోనే 3 DA, ఇతరత్రా అలవెన్సులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook