Supreme Court: కోర్టు వ్యవహారాల్ని మీడియా ప్రచురించవచ్చు : స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

Supreme Court: కోర్టులో జరిగే విచారణలు, న్యాయవాదుల వ్యాఖ్యలు..అసలు కోర్టులో ఏం జరుగుతోంది వంటి అంశాల్ని నిరభ్యంతరంగా మీడియా వెల్లడించవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఈసీకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 3, 2021, 07:21 PM IST
Supreme Court: కోర్టు వ్యవహారాల్ని మీడియా ప్రచురించవచ్చు : స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

Supreme Court: కోర్టులో జరిగే విచారణలు, న్యాయవాదుల వ్యాఖ్యలు..అసలు కోర్టులో ఏం జరుగుతోంది వంటి అంశాల్ని నిరభ్యంతరంగా మీడియా వెల్లడించవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఈసీకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఎన్నికల కోసం కోవిడ్ సంక్రమణను నిర్లక్ష్యం చేసి కోవిడ్ సెకండ్ వేవ్‌ ( Corona Second Wave)కు కారణమయ్యారంటూ ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఎన్నికల సంఘంపై హత్యానేరం నమోదు చేయవచ్చని సూచించడం దేశవ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఈ వ్యాఖ్యల్ని సవాలు చేస్తూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోవిడ్ విజృంభణకు సంబంధించి ఈసీకు కనీసం అవకాశమివ్వకుండా నిందిస్తున్నారని తెలిపింది. మద్రాస్ హైకోర్టు (Madras High Court) వ్యాఖ్యల అనంతరం ఎలక్ట్రానికి మీడియాలో తమ పనితీరును విమర్శిస్తూ వాదనలు సాగుతున్నాయని ఈసీ కోర్టుకు తెలిపింది.

అయితే దీనిపై సుప్రీంకోర్టు ( Supreme Court) అభ్యంతరం తెలిపింది. న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో..న్యాయవాదులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రజలకు తెలియజేసేందుకు మీడియాను తప్పనిసరిగా అనుమతించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. కోర్టులో జరిగే విచారణను నివేదించకుండా మీడియాను అడ్డుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. కోర్టు తీర్పులే కాకుండా విచారణలో భాగంగా వచ్చే ప్రశ్నలు, వాదనలపై ప్రజలు ఆసక్తి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కోర్టులు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటాయని తెలిపింది. హైకోర్టుల్ని తక్కువ చేయడం తమకిష్టం లేదని తెలిపింది. కోర్టును ఎలా నిర్వహించాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఈసీ ( Election Commission)కు అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. 

Also read: Mamata Banerjee: నందిగ్రామ్ ఫలితంపై కోర్టును ఆశ్రయించనున్న మమతా బెనర్జీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News