KV Anand Dies | దక్షిణాది చలనచిత్ర పరిశ్రమంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.వి. ఆనంద్(54) గుండెపోటుతో మృతిచెందారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయనకు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ ఆనంద్ మరణం పట్ల టాలీవుడ్, కోలీవుడ్, దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
డైరెక్టర్ కేవీ ఆనందర్ మరణవార్తను ఫిల్మ్స్ పబ్లిసిస్ట్ రియాజ్ కే అహ్మద్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు. తమిళం నుంచి తెలుగులోకి రీమేక్ అయిన రంగం, వీడొక్కడే, బ్రదర్స్, బందోబస్తు సినిమాల దర్శకుడిగా టాలీవుడ్లోనే ఆయనకు గుర్తింపు దక్కింది. దర్శకుడిగా మారకముందు సినిమాటోగ్రాఫర్‌గా పలు విజయవంతమైన సినిమాలకు పని చేశారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సహా 14 భాషలలో సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా చివరగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘శివాజీ: ది బాస్’ (2007) సినిమాకు పనిచేశారు.
Also Read: Venkatest లేటెస్ట్ మూవీకి కరోనా ఎఫెక్ట్, విక్టరీ వెంకటేష్ Narappa Movie రిలీజ్ వాయిదా
Legendary Film-maker 🎥 #KVAnand ( Aged 54 years ) passes away today early morning at 3 AM due to cardiac arrest
May His Soul rest in peace 🙏💐#RIPKVAnand sir pic.twitter.com/XYnVpusc2K
— RIAZ K AHMED (@RIAZtheboss) April 30, 2021
ఫొటో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కేవీ ఆనంద్ అనంతరం సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. 1990 దశకంలో సినిమాటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకుని మొత్తం 14 భాషలలో సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు. తొలి సినిమాకు జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. రజనీకాంత్‌తో శివాజీ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా చేసిన అనంతరం మెగాఫోన్ పట్టుకుని డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు.
Also Read: Tollywood స్టైలిష్ స్టార్ Allu Arjunకు కరోనా పాజిటివ్
Just woke up to this sad news that Dir KV Anand garu is no more. Wonderful cameraman , brilliant director and very nice gentleman . Sir you will always be remember & missed . Condolences to the near , dear & family .
Rest in Peace Sir . #KVAnand pic.twitter.com/V6ombIxZcy— Allu Arjun (@alluarjun) April 30, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook