TRS MLC Surabhi Vani Devi : ఇటీవల ఎన్నికైన హైదరాబాద్ - రంగారెడ్డి- మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కారు ముందు భాగం బాగా ధ్వంసమైంది. ప్రమాదం జరగగా ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నాయి. గురువారం ఉదయం స్పీకర్‌ను కలిసేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి అసెంబ్లీకి చేరుకున్నారు.
ఆమెను డ్రాప్ చేసిన అనంతరం వాహనం నడిపిన డ్రైవర్ అసెంబ్లీ ప్రాంగణంలోని రైల్వే కౌంటర్ వద్ద కారుతో గేటును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ వాణీదేవి కారు ముందు భాగం ధ్వంసమైంది. కాగా, డ్రైవర్ కాకుండా గన్‌మెన్ కారు నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన గన్‌మెన్‌ను సస్పెండ్ చేసినట్టు హైదరాబాద్(Hyderabad) సీపీ అంజనీకుమార్ తెలిపారు.
Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు
కాగా, హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవి(Surabhi VaniDevi) విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్‌కు కోల్పోయింది. సమీప అభ్యర్థి రామచందర్‌రావుపై సురభివాణి విజయం సాధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook