Ap High Court: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు తక్షణం డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Sec Nimmagadda Ramesh kumar ) పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మరోసారి రుజువైంది. 2019 మార్చ్‌లో ప్రారంభమై నామినేషన్ల దశలో కరోనా వైరస్ కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఏకగ్రీవాల వెనుక అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తుకు ఆదేశించారు. దాంతో ఏకగ్రీవమైన అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై విచారించిన ఏపీ హైకోర్టు (Ap high court) ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు షాక్ ఇచ్చింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్ఈసీకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీ దర్యాప్తు ఉత్తర్వుల్ని కొట్టివేసింది. తక్షణం ఏకగ్రీవంగా ఎంపికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు డిక్లరేషన్ ( Declaration) ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా 660 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ (Zptc Notification) వెలువడగా..8 స్థానాల ఎన్నికలు కోర్టు వివాదంతో ఆగిపోయాయి. మిగిలిన 652 జడ్పీటీసీ స్థానాల్లో 126 స్థానాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party) ఏకగ్రీవం చేసుకుంది. కడప జిల్లాలో 38, చిత్తూరులో 30, కర్నూలులో 16, ప్రకాశంలో 14, నెల్లూరులో 12, గుంటూరులో 8, కృష్ణాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 2, విజయనగరంలో 3, విశాఖపట్నంలో ఒక స్థానం ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం 126 మందిని తక్షణం అధికారికంగా ప్రకటించి మిగిలిన 526 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపించాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి విషయంలోనూ పరిధి దాటి వ్యవహరిస్తూ హైకోర్టు నుంచి అభ్యంతరం ఎదుర్కొంటున్నారు. ఎస్ఈసీకు ఎన్నికల కమీషనర్ అధికారాలు, పరిధి తెలియదా అనే విమర్శలు వస్తున్నాయి.
Also read: Insider trading: ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఆధారాలివే..ప్రముఖుల జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook