Jasprit Bumrah Honeymoon: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్, బుమ్రాల పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా బుమ్రా వివాహం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అవగా, మార్చి 15న సంజనా గణేశన్, జస్ప్రిత్ బుమ్రాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి పొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
కరోనా వైరస్ (COVID-19) వ్యాప్తి నేపథ్యంలో కేవలం కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంజనా గణేశన్‌ను టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా వివాహం చేసుకున్నాడు. ఐపీఎల్ 2021(IPL 2021) తనకు కీలకం కావడంతో అంతకుముందే వివాహం చేసుకునేందుకు ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ల నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా, సంజనా హనీమూన్ ప్లాన్‌లో ఉన్నారు. అయితే వీరికి ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఓ సలహా ఇచ్చింది. ఈ సమయంలో హనీమూన్‌కు మాల్దీవులు బాగుంటుందని జస్ప్రిత్ బుమ్రా ట్వీట్‌పై ఆ ఫ్రాంచైజీ ఫన్నీగా స్పందించింది.
Also Read: Jasprit Bumrah Wedding Photos: టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా మ్యారేజ్ ఫొటో గ్యాలరీ
Congratulations, guys! 🎉
We hear Maldives is great in April - May 😬 https://t.co/K3cBgz6cBS
— Rajasthan Royals (@rajasthanroyals) March 15, 2021
ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ 2021 జరగనుండగా, ఆ సమయంలో మాల్దీవులు బాలా బాగుంటుందని హనీమూన్ స్పాట్ హింట్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. తన పెళ్లి పనులతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్, వన్డే సిరీస్‌ల నుంచి బీసీసీఐని కోరి విశ్రాంతి తీసుకున్నాడు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా. నిర్ణయించిన ముహుర్తానికే గోవాలో స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన సంజనా గణేశన్, బుమ్రాల వివాహం(Jasprit Bumrah Wedding) ఘనంగా జరిగింది. తోటి భారత క్రికెటర్లు, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. క్రికెట్ ప్రేమికులు, టీమిండియా ఫ్యాన్స్ సైతం బుమ్రా, సంజనకు విషెస్ తెలుపుతున్నారు.
Also Read: IPL 2022: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త, వచ్చే ఐపీఎల్లో మరో 2 కొత్త జట్లు
కాగా, మరోవైపు జస్ప్రిత్ బుమ్రా గైర్హాజరీలో టీమిండియా, ఇంగ్లాండ్ జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనున్నాయి. ప్రస్తుతానికి రెండు టీ20లు జరగగా, 1-1తో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించాయి. నేటి నుంచి జరగనున్న టీ20లకు కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నేటి రాత్రి 7 గంటలకు మూడో టీ20 మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం కానుంది.
Also Read: IPL 2021 చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్స్ MS Dhoni ప్రాక్టీస్ షురూ, టైటిల్ లక్ష్యంగా సీఎస్కే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook