Ap Municipal Elections results 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అని నిరూపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్ని చేజిక్కించుకుంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మకంగా భావించిన విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లు దక్కించుకుంది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో(Ap Municipal Elections) పట్టణ ప్రజానీకం అధికార పార్టీని మరోసారి ఆదరించారు. వైఎస్ జగన్ ( Ys Jagan) నాయకత్వంపై విశ్వాసం ప్రదర్శించారు. అద్భుత విజయాన్ని అందించారు. అమరావతి అంశం చూపించి విజయవాడ ప్రజానీకాన్ని మభ్యపెట్టాలని చూసినా..విశాఖ ఉక్కు పేరుతో ప్రజల దృష్టి మరల్చాలని ప్రయత్నించినా ప్రజలు మాత్రం జగన్ వైపు మొగ్గు చూఫారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఏ కోశానా నమ్మలేదు. అధికార పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో మొత్తం 11 కార్పొరేషన్లను చేజిక్కించుకుంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లపై వైసీపీ జెండా ఎగురవేసింది.
విశాఖపట్నం(Visakhapatnam)లో మొత్తం 90 స్థానాలకు గానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr Congress party) 58 స్థానాల్లో విజయంతో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కార్పొరేషన్ చేజిక్కించుకుంది. తెలుగుదేశం పార్టీ 30 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ 1 స్థానాన్ని, జనసేన 3 స్థానాల్ని గెల్చుకున్నాయి. ఇక విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి. అయితే 64 స్థానాలున్న విజయవాడ కార్పొరేషన్లో ఇప్పటి వరకూ 44 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 33 స్థానాల్ని గెల్చుకుని కావల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుంది. తెలుగుదేశం పార్టీ(Telugu Desam ) కు ఇప్పటి వరకూ కేవలం 9 స్థానాల్లోనే విజయం సాధించగలిగింది. రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రతిష్ఠాత్మక కార్పొరేషన్లను అధికార పార్టీ దక్కించుకోవడంతో పాటు మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అదే హవా కొనసాగించింది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పత్తా లేకుండా పోయింది.
Also read: Ysr congress party victory: తుడుచుపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ: మంత్రి బొత్స సత్యనారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook