Maha Shivratri 2021 Puja Mantra In Telugu: శివుడు అనగా మంగళకరుడు, శుభాలు చేకూర్చేవాడు. నేడు మహాదేవుడు పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహా శివరాత్రి. శివ అంటే మంగళకరమైన, శుభప్రదమైన రాత్రి అని అర్థం. శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ, శివ దర్శనం, అభిషేకం, బిల్వ పత్రాలతో అర్చన, శివనామ సంకీర్తనల ద్వారా అజ్ణానం తొలగిపోయి శుభాలు కలుగుతాయి.
మంగళకరుడు శివుడు, పార్వతికి వివాహం జరిగిన పవిత్రమైన రోజును మహా శివరాత్రి(Maha Shivaratri 2021) అంటారు. ఈ రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. ఈ ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం చేసుకుంటే భక్తులకు సకల శుభాలు కలుగుతాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రతో కలిసి ఉన్నప్పుడు శివుడు లింగాకారంగా ఆవిర్బవించాడని శివపురాణం చెబుతోంది.
Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజు పరమ శివుడికి ఏమేం సమర్పించాలి, వేటితో అభిషేకం చేయాలో తెలుసా
ఈరోజు భక్తులు శివమూల మంత్రం పంచాక్షరీ మంత్రాన్ని, మహా మృత్యుంజయ మంత్రం, రుద్ర గాయంత్రి మంత్రాలను జపిస్తే శివుడు మీకు అన్ని శుభాలు చేకూరుస్తాడని, మీ పాపాలు తొలగిస్తాడని భక్తుల ప్రగాడ విశ్వాసం. శివమూల మంత్రం - శివ పంచాక్షరీ మంత్రం
ఓం నమ:శివాయ //
Also Read: Maha Shivratri 2021 Date And Time: మహా శివరాత్రి తేదీ, పూజకు శుభ ముహూర్తం, తిథి, ప్రాముఖ్యత
మహా మృత్యుంజయ మంత్రం - ఋగ్వేదంలోని ఒక మంత్రము
ఓం త్రయంబకం యజ్మహే సుగంధిమ్ పుష్టి వర్ధనం
ఊర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //
రుద్ర గాయత్రి మంత్రం
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నో రుద్రాయ ప్రచోదయాత్ //
Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు
శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ:శివాయలోని ఐదు బీజాక్షరాలకు అర్థం ఇలా వివరించవచ్చు..
న కారం బ్రహ్మను
మ కారం విష్ణువును
శి కారం రుద్రుడిని
వ కారం మహేశ్వరుడిని
య కారం సదాశివుడిని
సూచిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook