Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే

By Keeping these things under Your Pillow Gets Good Sleep | సౌకర్యవంతమైన నిద్ర లేకపోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరవవుతుంది. మరుసటి రోజు మీరు చేసే పనిలో దాని ప్రభావం కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 9, 2021, 03:45 PM IST
Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే

Things To Keep Under Pillow For Good Sleep: ఆధునిక జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని బాధిస్తుంటాయి. అయితే సౌకర్యవంతమైన నిద్ర లేకపోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరవవుతుంది. మరుసటి రోజు మీరు చేసే పనిలో దాని ప్రభావం కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి. అప్పటివరకూ ఉన్న మీ సమస్యలు తగ్గడం కంటే పెరుగుతాయి. 

జ్యోతిష్యం(Jyotish)తో పాటు వాస్తు శాస్త్రం(Vastu Shastra)లో నిద్రించడానికి సంబంధించి కొన్ని చిట్కాలు, ఆరోగ్య సూచనలు పేర్కొన్నారని పెద్దలు చెబుతుంటారు. ఒక వ్యక్తి నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను తన తలగడ(Pillow) కింద పెడితే ప్రశాంతమైన నిద్రను తీసుకువస్తుందని విశ్వసిస్తారు. దాంతోపాటు మీ జీవితంలో ఏదైనా సమస్య  నిత్యం వేదిస్తున్నా లేదా ఆర్థిక సమస్యలు(Financial Problem) ఉన్నా వాటిని అధిగమించడానికి సహాయపడుతుందని భావిస్తారు.

Also Read: Health Benefits of Milk: రాత్రి నిద్రించే ముందు ఓ గ్లాసు పాలు తాగితే ఎసౌకర్యవంతమైన నిద్ర లేకపోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరవవుతుంది. మరుసటి రోజు మీరు చేసే పనిలో దాని ప్రభావం కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి.న్నో ప్రయోజనాలో తెలుసా

వాస్తుకు సంబంధించి నిద్రవేళలో ఈ విషయాలు పాటించాలి.. 
- చిన్నారులు నిద్రపోయేటప్పుడు భయపడి, షాక్‌కు గురైనప్పుడు లేదా నిద్ర నుంచి మేల్కొని ఏడుస్తుంటే, కత్తెర లేదా ఏదైనా ఇనుము వస్తువులను పిల్లల తలగడ కింద ఉంచాలి. ఇలా చేయడం ద్వారా, ప్రతికూల శక్తి (Negative Energy)ని పిల్లల వద్దకు రాకుండా చేస్తుందని భావిస్తారు. అలా చేస్తే చిన్నారులు రాత్రంతా హాయిగా నిద్రపోతారు. 

- పిల్లలు మాత్రమే కాదు, పెద్దవారు సైతం నిద్రపోయేటప్పుడు చెడు ఆలోచనలు(Bad Thought) వచ్చినా లేదా పీడకలలు సమస్య ఎదురైనా ఉంటే తలగడ కింద కత్తి, కత్తెర లేదా ఇనుప వస్తువులను దిండు కింద ఉంచితే ప్రశాంతంగా నిద్రిస్తారు.

Also Read: COVID-19 Vaccine: కరోనా టీకాలు తీసుకున్న వారిలో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది

- మీ మనసులో భయాలు లేదా ఆందోళన లాంటికి కలిగినా, పీడకలలు వస్తున్నా, రాత్రి నిద్రపోయే ముందు హనుమాన్ చాలీసా(Hanuman Chalisa)ను పఠించాలని పెద్దలు చెబుతారు. లేకపోతే కనీసం హనుమాన్ చలీసాను మీ మంచం వద్ద ఉంచి నిద్రించాలని చెబుతారు. ఇలా చేయడం ద్వారా మీ మానసిక బలం పెరుగుతుంది మరియు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. మీ భయాలు తొలగిపోతాయి. అదే విధంగా దుర్గా సప్తశతిని ఉంచడం వల్ల మీకు ఎలాంటి భయాలు, పీడకలల సమస్య దూరం చేస్తుంది.

- వెల్లుల్లి(Garlic)ని కూడా అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కావాలంటే నిద్రవేళలో మీ తలగడ(Pillow) కింద కొన్ని వెల్లుల్లి మొగ్గలను ఉంచితే హాయిగా నిద్రపోతారు. వెల్లుల్లి ద్వారా మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉత్పన్నమై చెడు సంకేతాలను దూరం చేస్తుంది. తద్వారా మీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. మీ మనస్సులో ఎలాంటి చెడు, ప్రతికూల ఆలోచనలు రావు.

Also Read: Corona Vaccination: ఈ వ్యాధులు ఉన్నాయా, అయితే COVID-19 Vaccine తీసుకునేందుకు అర్హులు అవుతారు

- నిద్రవేళలో సోపు గింజలు(Fennel Seeds)ను దిండు కింద ఉంచడం ద్వారా, నిద్ర రాహు దోషాన్ని అధిగమించడానికి దోహదం చేస్తుంది. పీడకలలు మరియు మానసిక సమస్యలను సైతం సోపు గింజ తొలగిస్తుంది. ముఖ్యంగా రాహువు యొక్క చెడు ప్రభావాలను మనపై తగ్గిస్తుంది. వీటితో పాటు తలగడ కింద కొన్ని యాలకులు (Cardamom) ఉంచి నిద్రించడం వల్ల బాగా నిద్రపడుతుందని పెద్దలు చెబుతారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News