Covid vaccination: ప్రధాని మోదీ తరువాత కోవిడ్ వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకున్నారో తెలుసా

కరోనా వ్యాక్సినేషన్ రెండవ స్టేజ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి టీకాను వేయించుకుని రెండవ దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా కేంద్రంలోని పెద్దలు వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కేంద్ర మంత్రులు, పెద్దలెవరంటే..

Covid vaccination: కరోనా వ్యాక్సినేషన్ రెండవ స్టేజ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి టీకాను వేయించుకుని రెండవ దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా కేంద్రంలోని పెద్దలు వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కేంద్ర మంత్రులు, పెద్దలెవరంటే..
 

1 /5

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెన్నైలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు.  అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

2 /5

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ పాట్నాలోని IGIMSలో కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. డోసు తీసుకున్న తరువాత అరగంట వరకూ అబ్జర్వేషన్‌లో ఉంచారు. బీహార్ రాష్ట్రమంతా కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రి అయినా లేదా ప్రభుత్వ ఆసుపత్రి అయినా సరే వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని చెప్పారు. 

3 /5

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇవాళ అసెంబ్లీ ఆసుపత్రిలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కోవ్యాగ్జిన్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు కూడా వ్యాక్సిన్ తీసుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

4 /5

రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్ర్ ..జయపూర్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ తీసుకున్నారు. ఎస్ఎంఎస్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్ భంఢారీ ఆయనతోనే ఉన్నారు.

5 /5

రెండవ దశ వ్యాక్సినేషన్‌లో అందరికంటే ముందుగా ప్రధాని మోదీ తరువాత కేంద్ర మంత్రి గజేంద్ర సింహ్ టీకా తీసుకున్నారు. ఈయన కూడా ఎయిమ్స్ ఆసుపత్రిలోనే వ్యాక్సిన్ తీసుకున్నారు.