Apple new products: యాపిల్ కొత్త ఉత్పత్తులు మార్చ్ 16న మార్కెట్‌లో

Apple new products: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టనుంది. 2021లో కొత్త ఆవిష్కరణలకు యాపిల్ సంస్థ ప్లాన్ చేస్తోంది. మార్చ్ 16న యాపిల్ కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లో రానున్నాయని తెలుస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2021, 05:00 PM IST
  • 2021 సంవత్సరానికి కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న యాపిల్ సంస్థ
  • మార్చ్ 16న యాపిల్ కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం
  • యాపిల్ టీవీ, ఐప్యాడ్ ప్రొ, న్యూ ఐ మ్యాక్, ఎయిర్ పాడ్స్‌లను మెగా ఈవెంట్‌లో లాంచ్ చేసే ఆలోచన
Apple new products: యాపిల్ కొత్త ఉత్పత్తులు మార్చ్ 16న మార్కెట్‌లో

Apple new products: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టనుంది. 2021లో కొత్త ఆవిష్కరణలకు యాపిల్ సంస్థ ప్లాన్ చేస్తోంది. మార్చ్ 16న యాపిల్ కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లో రానున్నాయని తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్లలో( Smartphones) కాస్ట్ లీ బ్రాండ్‌గా, మార్కెట్ దిగ్గజంగా పేరున్న యాపిల్ సంస్థ( Apple New products) కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లో త్వరలో రానున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టేందుకు సంస్థ యోచిస్తోంది. ఐ ప్యాడ్ ప్రొ, యాపిల్ టివి, ఐ మ్యాక్, ఎయిర్ పాడ్స్‌లను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అధికారికంగా ఎప్పుడనేది యాపిల్ సంస్థ ప్రకటించకపోయినా..మార్చ్ 16న యాపిల్ టీవీ( Apple tv), ఐప్యాడ్ ప్రొ( Ipad pro), ఐ మ్యాక్, ఎయిర్ పాడ్స్‌లను ప్రవేశపెట్టేనుందని తెలుస్తోంది.  ఇప్పటికే ఈ ఉత్పత్తులకు సంబంధించి అప్‌గ్రేడ్స్ సిద్ధం చేసింది.  మార్చ్ నెలలో జరిగే యాపిల్ సంస్థ మెగా ఈవెంట్‌లో కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో న్యూ ఐప్యాడ్ ప్రొ, యాపిల్ టీవి, ఐమ్యాక్ అప్‌డేటెడ్ వెర్షన్ సహా హార్డ్‌వేర్ నూతన శ్రేణిని వర్చువల్ కార్యక్రమం ద్వారా లాంచ్ చేయనుంది. 

Also read: Whatsapp: ఇండియాలో వాట్సప్‌పై నిషేధం పడనుందా..కొత్త నిబంధనలేమంటున్నాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News