Farmers vs Up Police: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైతుల్ని ఖాళీ చేయించాలన్న యూపీ ప్రభుత్వ ఆదేశాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఉరి వేసుకుని చచ్చిపోతామని తేల్చి చెప్పారు రైతులు.
ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన ( High tension in farmers protest ) మరోసారి ఘర్షణగా మారింది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ సరిహద్దుల్లోని ( Delhi Borders ) ఘాజీపూర్ ( Ghazipur ) వద్ద పరిస్థితి రణరంగంగా మారింది. 24 గంటల్లోగా రైతులు రహదార్లను ఖాళీ చేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ( Up cm yogi adityanath ) ఆదేశాలు జారీ చేయడంతో భారీగా పోలీసులు ( Up Police ) చేరుకున్నారు. రైతులు కదలకపోవడంతో బలవంతంగా ఖాళీ చేయించే ( Up police to vacate farmers ) ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. రైతులపై దాడి చేయవద్దంటూ రైతు సంఘ నేతలు కన్నీటి పర్యంతమవడం విశేషం.
మూడు రైతు చట్టాలను ( New farm laws ) రద్దు చేసే వరకు ఘాజీపూర్ రహదారిని ( Ghazipur highway ) ఖాళీ చేయమని రైతులు తేల్చి చెప్పారు. శాంతియుతంగా దీక్షలను చేస్తున్న తమని ఖాళీచేయిస్తే ఇక్కడే ఉరివేసుకుంటామని రైతులు బెదిరించారు. బీజేపీ ప్రభుత్వం తమను హతమార్చేందుకు కుట్రలు పన్నుతోందని బీకేయీ నేత రాకేష్ ఆరోపించారు. బుల్లెట్లనైనా ఎదుర్కొంటాం కానీ..భయపడి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతుల్ని ఖాళీ చేయించేందుకు భారీగా కేంద్ర, రాష్ట్ర పోలీసుల బలగాలు చేరుకుంటున్నాయి.
Also read: Farmers protest: 24 గంటల్లో రహదార్లు ఖాళీ చేయాలంటూ యూపీ ప్రభుత్వం అల్టిమేటం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook