Can You Drink Alcohol After COVID-19 Vaccination: కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు, వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ జనవరి 16న ప్రారంభమైంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించడంతో వైద్యశాఖాధికారులు వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి తొలి దశ టీకాలు ఇస్తున్నారు. అయితే మందుబాబులు అలర్ట్గా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Can You Drink Alcohol After COVID-19 Vaccination: కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు, వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ జనవరి 16న ప్రారంభమైంది. కోవాగ్జిన్(Covaxin), కోవిషీల్డ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేయడంతో తొలి దశ టీకాలు ఇస్తున్నారు. అయితే మందుబాబులు అలర్ట్గా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. అయితే మద్యంప్రియులు ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఎలాంటి మద్యం ముట్టరాదని చెబుతున్నారు. అదే విధంగా టీకా తీసుకున్న తరువాత సైతం వీరు మద్యం సేవించవద్దని హెచ్చరిస్తున్నారు. Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..
కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటున్న మందుబాబులు నెలన్నర రోజులకుపైగా మద్యం సేవించవద్దని సలహా ఇస్తున్నారు. మద్యం(Alcohol) సేవించేవారిలో లింపోసైట్ కణాలు సగానికి సగం పడిపోతాయిని చెప్పారు.
లింపోసైట్ కణాలు తగ్గడంతో కరోనా వ్యాక్సిన్ ప్రభావం చాలామేరకు తగ్గుతుందని చెప్పారు. మరోవైపు మద్యం సేవించడం వల్ల రోగ నిరోధకవ్యవస్థ(Immunity) సైతం దెబ్బ తింటుందని మందుబాబులకు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. Also Read: Vaccination tips: వ్యాక్సిన్ వేయించుకున్నాక...ఏం చేయాలి..ఏం చేయకూడదు
తొలి దశ టీకా తీసుకున్నవారికి 28 రోజుల తరువాత రెండో దఫాలోనూ అదే కంపెనీ టీకా ఇస్తారు. దాని ప్రభావం తగ్గకుండ ఉండాలంటే కరోనా టీకా తీసుకున్న రోజు నుంచి కనీసం నెలన్నరపాటు మద్యం ముట్టరాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మరికొందరు కనీసం నెల రోజులపాటు మద్యం సేవించవద్దని చెబుతున్నారు. Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?