Symptoms After Getting A COVID-19 Vaccine: కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశంలో కీలక అడుగు పడనుంది. జనవరి 16న భారత్లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ప్రారంభిస్తున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా అత్యవసర వినియోగం నిమిత్తం భారత్లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనుమతి పొందడం తెలిసిందే.

కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకోవాలా వద్దా అనే అనుమానాలు సైతం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా గురువారం జీ న్యూస్ మీడియాతో మాట్లాడి పలు విషయాలు వివరించారు.
కరోనా టీకాలు తీసుకున్న వారిలో కొందరికి స్వల్ప జ్వరం, టీకా తీసుకున్న చోట కొంతమేర నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్ కృష్ణా ఎల్లా చెప్పారు. కొందరిలో తలనొప్పి, వికారం, బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే టీకా తీసుకున్న వారు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. అయితే మూడు రోజుల తర్వాత కూడా జ్వరం ఉంటే మాత్రం కచ్చితంగా ఆ వ్యక్తి డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
వ్యాక్సిన్ అనేది 18 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమేనని, చిన్నారులకు కాదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో వాక్సిన్ తీసుకురావడానికి మరో 6 నెలల సమయం పడుతుందన్నారు.
చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. చిన్నారులపై ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తేనే.. వారికి కరోనా టీకాలు ఇవ్వాలా వద్దా అనే దానిపై తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు.