Corona Vaccination India: కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం వేచి చూస్తున్న భారతీయులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. భారతీయులందరికీ కోవిడ్-19 టీకాను ఉచితంగా అందించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష్ వర్ధన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తాం అని తెలిపారు.
Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
కోవిడ్-19 (Covid-19) వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది భారతీయులకు ఈ వార్త ఊరటనివ్వనుంది. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఇటీవలే వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించారు. ఆ ప్రక్రియను సమీక్షించడానికి వెళ్లిన కేంద్రమంత్రి డా.హర్ష్ వర్ధన్ కీలక విషయాలు తెలిపారు.
ఢిల్లీతో (Delhi) పాటు భారతదేశం అంతటా టీకాను ఉచితంగా ప్రజలకు అందించనున్నట్టు ఆయన తెలిపారు.
#WATCH | Not just in Delhi, it will be free across the country: Union Health Minister Dr Harsh Vardhan on being asked if COVID-19 vaccine will be provided free of cost pic.twitter.com/xuN7gmiF8S
— ANI (@ANI) January 2, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe