AP Eamcet Counselling 2020: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ , ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 28 నుంచి 31వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని..సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.
ఏపీ ( AP ) ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ వెలువరించింది. కోర్సుల ప్రవేశం కోసం వెబ్ ఆప్షన్ల ( Web Options ) ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి 31 వరకూ జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 88 వేల 667 అభ్యర్ధులు ఎంసెట్ కౌన్సిలింగ్ ( Eamcet Counselling ) కు రిజిస్టర్ చేసుకున్నారు. మిగిలిన వారికి కూడా ధృవపత్రాల పరిశీలనకు అవకాశం కల్పిస్తున్నారు.
అభ్యర్ధుల సౌకర్యార్ధం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రాల్ని జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. ప్రత్యేక కేటగిరీకి చెందిన దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లల ధృవపత్రాల పరిశీలనను డిసెంబర్ 29వ తేదీన విజయవాడ పాలిటెక్నిక్ కళాశాల ( Vijayawada polytechnic college ) లో చేపట్టనున్నారు.
Also read: Antarvedi new chariot: అంతర్వేది స్వామి సన్నిధిలో కొత్త రధం సిద్ధం
అభ్యర్దులు తమ ఆప్షన్లను జనవరి 1వ తేదీన సవరించుకునే అవకాశముంది. జనవరి 3వ తేదీ సాయంత్రం అభ్యర్ధులకు మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటుకు సంబంధించి 257 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1 లక్షా 29 వేల 16 సీట్లు, 120 ఫార్మసీ కళాశాలల్లో 10 వేల 675 సీట్లు, 62 ఇంజనీరింగ్ కళాశాలల్లో 1860 డీ ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా 82 ఇంజనీరింగ్ కళాశాలలు, 19 బీ ఫార్మసీ కళాశాలలు, 7 డీ ఫార్మసీ కళాశాలల సీట్లను ఇంకా ప్రభుత్వం ( Ap government ) ఆమోదించాల్సి ఉంది.
జనవరి 3 నాటికి సీట్ల కేటాయింపు ( Seats allottment from january 1st ) పూర్తి చేసి..4,5 తేదీల నాటికి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తొలి విడత పూర్తయ్యాక..తిరిగి రెండు, మూడు విడతల సీట్ల కేటాయింపు జరగనుంది. జనవరి 9 నుంచి బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.
Also read: Covid vaccination in ap: ఏపీలో కోటిమందికి వ్యాక్సినేషన్..రెండ్రోజులపాటు డ్రై రన్
AP Eamcet Counselling 2020: ఇంజనీరింగ్, ఫార్మా వెబ్ ఆప్షన్లు ప్రారంభం, జనవరి 1 నుంచి
ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ఆడ్మిషన్లకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రారంభం
డిసెంబర్ 28 నుంచి 31వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు అవకాశం
జనవరి 1 సాయంత్రం నుంచి సీట్ల కేటాయింపు