ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణ పిటీషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. సంబంధించిన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ( Ap local body elections ) నిర్వహణ పంచాయితీ త్వరలో కొలిక్కి రానుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ( Ap Government )..ఎన్నికల కమీషన్‌కు మధ్య రేగిన వివాదం హైకోర్టు ( High court ) కు చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ ( Election commission )హైకోర్టును ఆశ్రయించగా..దీనిపై విచారణ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణపై తాము నివేదించిన అన్ని అంశాల్ని పరిగణలో తీసుకోవాలని ఏపీ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల తేదీ, నెల విషయంలో కూడా చర్చించాలన్నారు. దీనికి స్పందించిన హైకోర్టు..ప్రభుత్వానికున్న అభ్యంతరాలతో ఎన్నికల కమీషన్‌కు మూడ్రోజుల్లో ఓ లేఖ రాయాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారులంతా ఎన్నికల కమీషన్‌తో చర్చించాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఎన్నికల నిర్వహణ వివాదానికి సంబంధించిన పిటీషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలకు ఎస్ఈసీ ( SEC ) సిద్ధం కాగా..కరోనా పరిస్థితులు వ్యాక్సినేషన్ ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎన్నికల కమీషన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.