సామాన్యులపై మరోసారి గ్యాస్ బండ పిడుగు పడింది. 15 రోజుల వ్యవధిలో మరోసారి సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరల మోతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఎల్పీజీ మరోసారి గుదిబండగా మారింది. కేవలం రెండు వారాల వ్యవధిలో రూ.100 పెంచారు.
LPG Price Hike RS 50: సామాన్యులపై మరోసారి గ్యాస్ బండ పిడుగు పడింది. 15 రోజుల వ్యవధిలో మరోసారి సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరల మోతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఎల్పీజీ మరోసారి గుదిబండగా మారింది. కేవలం రెండు వారాల వ్యవధిలో రూ.100 పెంచారు.
LPG Price Hike: సామాన్యులపై మరోసారి గ్యాస్ బండ పిడుగు పడింది. 15 రోజుల వ్యవధిలో మరోసారి సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరల మోతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఎల్పీజీ మరోసారి గుదిబండగా మారింది. ఇక నుంచి సబ్సిడీ సిలిండర్లు మరింత ప్రియం కానున్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో రూ.100 పెంచారు.
డిసెంబర్ 2వ తేదీన రూ.50 మేర ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచిన చమురు సంస్థలు మరోసారి ధరలు పెంపు నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచి పెరిగిన ధరలు సైతం అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.
మంగళవారం నాడు రూ.50 మేర ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ సిలిండర్లపై పెంచారు. తాజాగా ధరల పెంపు నిర్ణయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని డిల్లీలో 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ ధర రూ.644 నుంచి రూ.694కి చేరింది
హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధర (LPG Gas Price in Hyderabad) రూ.696.50కి పెరిగింది. 5 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.18 పెరగగా, 19 కేజీల సిలిండర్‌పై రూ.36.50 మేర పెంచారు. Also Read: Postal Life Insurance Benefits: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కలిగే ప్రయోజనాలివే
వినియోగదారులకు గృహ అవసరాల కోసం సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. ఆ 12 వంటగ్యాస్ సిలిండర్లపై రాయితీని పొందవచ్చు. ఆ కోటా పూర్తయ్యాక మార్కెట్ ధరలకే ఎల్పీసీ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. Also Read: LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే