సిగరెట్ తాగడం వల్ల మీ ఉపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. వాటి పనితీరు దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక సిగరెట్లో వేలాది హానికారక రసాయనాలు ఉంటాయి. అవి మీ లంగ్స్‌ను డ్యామేజ్ చేస్తాయి.
ఘాటు వాసన నుంచి, పెర్ప్యూమ్, ఎయిర్ ఫ్రెష్నర్స్ నుంచి దూరంగా ఉండండి. అందులో ఉండే విషకారకాలు ఊపిరితిత్తులకు నష్టం కలిగించగలవు.
శ్వాసక్రియ మెరుగు అవ్వాలి అనుకుంటే..ఊపరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ప్రాణాయామ వంటి బ్రీథింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఆక్సిజన్ సప్లై మెరుగు అవుతుంది.
ఆరోగ్యకరమైన లంగ్స్ కోసం మంచి పోషకాలు ఉన్న ఆహారం మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో యాంటిఆక్సిడెంట్స్, ఫొరాట్, ప్రొటీన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి.
వ్యాయామం వల్ల మీ లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. దీని వల్ల నిస్సత్తువ తగ్గుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తొలుగుతాయి. లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది.