కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలపై ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మొదట్నుంచీ ప్రత్యేక శ్రద్ధ వహించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ సర్కార్ దేశంలోనే అతి ఎక్కువ కరోనా నిర్ధారణ టెస్టులతో పాటు వేగవంతంగా కోవిడ్19 పరీక్షలు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటింది. నిన్న ఒక్కరోజు వ్యవధిలో 54,710 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య కోటి చేరుకుంది.
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,00,17,126కి చేరింది. తాజాగా జరిపిన టెస్టుల్లో 620 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,67,683కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 3,787 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.
Also Read : AP: ఏపీలో మూడ్రోజులపాటు అతి భారీ వర్షాలు
అదే సమయంలో ఏడుగురు కరోనాతో పోరాడుతూ చనిపోయారు. ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 6,988కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,397 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న సమయంలోనూ ఏపీ సర్కార్ వెనక్కి తగ్గకుండా ఇంటింటికి కోవిడ్19 నిర్దారణ టెస్టులు చేపించడం తెలిసిందే.
Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
CoronaVirus Tests In AP: కోటి దాటిన కరోనా పరీక్షలు