మహిళా ఉద్యమ నిధిలో బాగంగా మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పత్తుల తయారీ సంస్థలకు రుణాలు అందించే అవకాశం ఉంది.
కరోనావైరస్ సపమయంలో మీరు నిరుద్యోగులుగా మారి ఉంటే, మీరు మహిళ అయితే, ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు సొంత వ్యాపారం ప్రారంభించవచ్చు. Small Industrial Development Bank Of India ఇలాంటి మహిళలకు అందగా ఉండనుంది.
సిడ్బీ ప్రారంభించిన పథకంతో చిన్న, సూక్ష్మ మధ్య స్థాయి పరిశ్రమలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. లేదా పాత వ్యాపారాన్ని మళ్లీ గాడిలో పెట్టవచ్చు. Mahila Udyam Nidhi Scheme లో భాగంగా రుణాలను అందిస్తారు.
ఈ పథకంలో భాగంగా మహిళల సొంత వ్యాపారం ప్రారంభిలా ప్రోత్సాహిస్తారు. అది కూడా తక్కువ వడ్డీకే అందిస్తారు. దీంతో మీరు మాన్చు తయారీ ఉత్పాదక సంస్థలను ఏర్పాటు చేయవచ్చు.
ఈ పథకంలో భాగంగా తక్కువ వడ్డీకి రూ.10 లక్షల రుణం లభిస్తుంది. దాన్ని 5 సంవత్సరాల్లోపు తిరిగతి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రుణం పొందేందుకు మహిళల ఎలాంటి సెక్యూరిటీ లేదా గ్యారంటీని చూపించాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని నిబంధనులు మాత్రం ఉంటాయి.
బ్యూటీ పార్లర్, సెలూన్, టైలరింగ్, వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులు, క్యాంటీన్, రెస్టారెంట్, నర్సరీ, లాండ్రీ డ్రై క్లీనింగ్, డేకెయిర్, కంప్యూటర్, డెస్క్ టాప్ పబ్లిషింగ్, కేబుల్ టీవీ నెట్వర్క్, జీరాక్స్ సెంటర్, రోడ్డు రవాణ, టెస్టింగ్ ల్యాబ్స్, వాషింగ్ మెషీన్, ఇతర యంత్ర రిపేయిర్, జామ్ జెల్లీస్ తయారు చేసే రంగంలో ఉన్న మహిళలకు ఈ రుణాలు అందిస్తారు.