హైదరాబాద్ : రాష్ట్రంలోని సినిమా థియేటర్లు తెరిచేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. అయితే, కరోనావైరస్ నివారణ కోసం థియేటర్ల నిర్వహణలో థియేటర్ల యాజమామాన్యాలకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈమేరకు మంగళవారం ఆదేశాలు జారీఅయ్యాయి. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచే థియేటర్స్, మల్టీప్లెక్సులు తెరుచుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసినప్పటికీ.. తెలంగాణలో మాత్రం థియేటర్స్ ఇంకా తెరుచుకోలేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశం అయినప్పుడు కూడా ఈ అంశం చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సర్కార్ నుంచి ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది.
థియేటర్స్ పునఃప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ నుంచి అనుమతులు రావడంతో త్వరలోనే తెలంగాణలోనూ థియేటర్స్ తెరిచేందుకు ( Theatres reopening ) ఎగ్జిబిటర్స్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణలో థియేటర్స్ రీఓపెన్ కావ్వొచ్చని తెలుస్తోంది.
Also read : One year of Coronavirus: కరోనాకు ఏడాది పూర్తి.. కరోనా విధ్వంసంపై పలు గణాంకాలు
ఇదిలావుంటే, గతంలోనే పబ్లిక్ గేదరింగ్స్‌పై తెలంగాణ సర్కార్ పలు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కంటైన్మెంట్ జోన్స్‌కి అవతలి ప్రాంతాల్లో సోషల్ ఈవెంట్స్, అకడమిక్స్, కోచింగ్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్, ఎంటర్టైన్మెంట్, కల్చర్, రిలీజియస్, పొలిటికల్ మీటింగ్స్ నిర్వహణకు 100 మంది వ్యక్తులను మాత్రమే అనుమతించాలని సూచిస్తూ ప్రభుత్వం ఇదివరకు జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. అన్ని సందర్భాల్లోనూ ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించడం వంటి నిబంధనలను ( COVID-19 protocol ) తప్పనిసరి చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి