Covid-19 Vaccine: మార్చి 2021లోపు వ్యాక్సిన్.. సీరం ఇనిస్టిట్యూట్ క్లారిటీ

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum Institute Of India ) శుభవార్త తెలిపింది. మార్చి 2021 నాటికి కోవిడ్-19 ( Covid-19 ) వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని సీరం ఇనిస్టిట్యూడ్ ఆఫ్ ఇండియా డైరక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ స్పష్టం చేవారు. కరోనావైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న భారతీయులకు ఈ వార్త ఆశాజనకంగా కనిపిస్తోంది.

Last Updated : Oct 18, 2020, 02:20 PM IST
    1. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది.
    2. మార్చి 2021 నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని సీరం ఇనిస్టిట్యూడ్ ఆఫ్ ఇండియా డైరక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ స్పష్టం చేవారు.
    3. కరోనావైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న భారతీయులకు ఈ వార్త ఆశాజనకంగా కనిపిస్తోంది.
Covid-19 Vaccine: మార్చి 2021లోపు వ్యాక్సిన్.. సీరం ఇనిస్టిట్యూట్ క్లారిటీ

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum Institute Of India ) శుభవార్త తెలిపింది. మార్చి 2021 నాటికి కోవిడ్-19 ( Covid-19 ) వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని సీరం ఇనిస్టిట్యూడ్ ఆఫ్ ఇండియా డైరక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ స్పష్టం చేవారు. కరోనావైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న భారతీయులకు ఈ వార్త ఆశాజనకంగా కనిపిస్తోంది.

READ ALSO | Ration Kit By Govt: తెలంగాణ ప్రభుత్వం అందించే రేషన్ కిట్‌లో ఉండే సరుకులు ఇవే

కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీకీ అనేక సంస్థలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ 2021 మార్చి నాటికి అందుబాటులోకి వస్తుంది అని తెలిపారు జాదవ్. డిసెంబర్ 2020 నాటికి భారత దేశంలో 60 నుంచి 70 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నాయి. క్లియరెన్స్ పొందిన తరువాత ఈ ప్రక్రియ వేగవంతం అవుతుంది అని తెలిపారు.

కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ, పంపిణికీ సంబంధించిన ప్రక్రియను వేగవంత చేయాల్సిందిగా ప్రధాని మోదీ ( PM Modi ) శనివారం నాడు అధికారులకు సూచించారు. ప్రస్తుతం భారత దేశంలో మూడు టీకాలు అడ్వాన్స్ స్టేజీలో ఉన్నాయి అని... ఇందులో రెండు వ్యాక్సిన్ లు ఫేజ్ 2లో ఉండగా.. మరొకటి ఫేజ్ 3లో ఉన్నాయని ప్రధాని కార్యాలయం తెలిపింది.

ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం

భారత దేశ వైవిధ్యభరితమైన భౌగోళిక వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుని అందరికీ సకాలంలో టీకాలు అందేలా ఏర్పాట్లు చేయాలి అని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. రవాణా, డిలవరీ, పాలనా యంత్రాంగాలు అన్నీ ఈదిశలో వేగంగా పని చేయాలి అని ఆయన సూచించారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News