Hyderabad Rains: హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad) ను జలప్రళయం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం భారీ వర్షాలతో అతలాకుతలమయిన నగరాన్ని భారీ వర్షాలతో (heavy rainfall) వరదలు చుట్టుముట్టాయి. ఎటుచూసినా నీరే కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మొన్నటి వరదలతో ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి మళ్లీ వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాత్రి నుంచి భారీగా వర్షం కురవడంతో ఉద్యోగులు ఇళ్లకు కూడా పోలేకపోయారు.
రహదారులన్నీ వరదతో పొటెత్తాయి. చాలా వాహనాలు వరద ప్రవాహానికి కుట్టుకుపోయాయి. దీంతో నగరం అంతటా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే విద్యుదాఘాతంతో ఇద్దురు చనిపోయారు. నగరం అంతటా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Also read: Navratri Day 2: ‘బాలా త్రిపురసుందరి’గా అమ్మవారి దర్శనం
#WATCH: Heavy rainfall in Hyderabad triggers water logging in parts of the city; visuals from Chandrayangutta area. #Telanagana (17.10) pic.twitter.com/awqPQEWmeN
— ANI (@ANI) October 18, 2020
అత్యవసరమైతేనే తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచించారు. ఈ క్రమంలోనే మరో అల్పపీడన ప్రభావం కూడా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీసులు, ఎన్డీఆర్ఎస్ సిబ్బంది ఇంకా అనేక ప్రాంతాల్లో రెస్క్యూ నిర్వహిస్తున్నారు.
#WATCH Rachakonda: Abdullapurmet Police pulls out a car stuck in overflowing water with the help of a JCB machine. #Telangana (17.10) pic.twitter.com/AWEC4q1UQc
— ANI (@ANI) October 17, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe