KGF Chapter 2: కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల తేదీపై ఒక క్లారిటీ వచ్చిందిగా

యష్ ( Yash ) హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 (KGF Chapter 1 ) దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Last Updated : Oct 10, 2020, 09:31 PM IST
    • యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
    • డబ్బింగ్ సినిమా చూసిన వాళ్లు కూడా మూవీకి ఫిదా అయిపోయారు.
    • వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు కలిసి వచ్చింది ఈ చిత్రం.
KGF Chapter 2: కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల తేదీపై ఒక క్లారిటీ వచ్చిందిగా

యష్ ( Yash ) హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 (KGF Chapter 1 ) దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. డబ్బింగ్ సినిమా చూసిన వాళ్లు కూడా మూవీకి ఫిదా అయిపోయారు. వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు కలిసి వచ్చింది ఈ చిత్రం. కేజీఎఫ్ చాప్టర్ 1 మంచి విజయం సాధించడంతో దర్శక నిర్మాతలు చాప్టర్ 2పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి మరో లెవల్లో ఉండాలి అని ప్లాన్ చేసి సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రవీనా టాండన్ వంటి తారలను కీలక పాత్రల కోసం ఎంచుకున్నారు. 

ALSO READ | Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ

ఈ ఏడాది దసరా సందర్భంగా సినిమాను విడుదల చేయాలి అని భావించినా.. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల చిత్రీకరణ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దాంతో సినిమా విడుదల తేదీ కూడా మారిపోయింది. అయితే ఆగస్ట్ నెలలో షూటింగ్ మళ్లీ మొదలైంది.

అంతలోనే కేజీఎఫ్ చాప్టర్ 2లో  విలన్ పాత్ర చేస్తున్న సంజయ్ దత్ ( Sanjay Dutt ) అనారోగ్యంతో షూటింగ్ నుంచి కొంత కాలం దూరం అయ్యాడు. ఇటీవలే మళ్లీ ఆరోగ్యం కోలుకున్నట్టు సమాచారం. దాంతో పాటు ఇటీవలే మూవీ హీరో యష్ మళ్లీ చిత్రీకరణలో చేరుతున్నట్టు తెలిపాడు. 

అంటే కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ మళ్లీ గాడిలోకి పడింది. అయితే సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే సందేహం మాత్రం చాలా మందికి ఉంది. దీనికి సమాధానం కూడా తెలిసింది. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయితే 2021 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నిజంగా అలా జరిగితే మాత్రం కేజీఫ్ అభిమానులకు అది శుభవార్త.

ALSO READ | NEET Results 2020: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల తేదీలు ఇవే!  ఇలా చెక్ చేయండి

 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News