ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో గత 12 ఏళ్లుగా మెరుగు పరుచుకుంటూ వస్తున్న ఓ రికార్డును 13వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేజార్చుకుంది. ఐపీఎల్ 2020లో 21వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై దినేష్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడ్సర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించడం తెలిసిందే. అయితే ఈ ఓటమి ద్వారా ఐపీఎల్ సీజన్ 1 నుంచి మెరుగు చేసుకుంటూ వచ్చిన ఓ రికార్డును చెన్నై కోల్పోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై లక్ష్యఛేదనలో ఓడిపోవడం చెన్నై సూపర్‌కింగ్స్ మొదటిసారి ఓటమిపాలైంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ కోల్‌కతాపై ఛేజింగ్ చేస్తూ చెన్నై గతంలో ఎనిమిదిసార్లూ (ప్రతి మ్యాచ్) గెలిచింది.
మరోవైపు వరుస ఓటమలు తర్వాత గుణపాఠం నేర్చుకున్న కేకేఆర్ అద్భుత విజయంతో రేసులోకి వచ్చింది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచిన మ్యాచ్‌లో అయిదేళ్ల తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. గెలిచి కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం 2015 తర్వాత ఇదే తొలిసారి. గత అయిదేళ్లుగా టాస్ నెగ్గిన ప్రతిసారి కేకేఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకునేది. అయితే ఛేదనలో తడబడుతున్నట్లు కనిపించిన కేకేఆర్ నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లను నమ్ముకుని విజయం సాధించింది.
Also read : Prithvi Raj Yarra: సన్‌రైజర్స్ టీమ్‌లోకి పృథ్వీరాజ్.. ఎవరీ తెలుగు తేజం ?
కాగా, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ రాహుల్ త్రిపాఠి (51 బంతుల్లో 81; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం ఓపెనర్ వాట్సన్ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ, చివర్లో జడేజా (8 బంతుల్లో 21 నాటౌట్) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేదార్ జాదవ్ రాణించకపోవడం చెన్నై ఓటములకు ఓ కారణంగా కనిపిస్తోంది.
Also read : Steve Smith: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
ఐపీఎల్ చరిత్రలో చెన్నై అలా ఓడటం తొలిసారి.. రికార్డులకు బ్రేక్