Jagananna Vidyakanuka: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా నేడే ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. కృష్ణా జిల్లా పునాదిపాడు హైస్కూల్ లో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కొత్త పధకం ఇవాళ ప్రారంభం కానుంది.

Last Updated : Oct 8, 2020, 09:33 AM IST
Jagananna Vidyakanuka: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా నేడే ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Andhra pradesh cm ys jagan ) మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. కృష్ణా జిల్లా పునాదిపాడు హైస్కూల్ లో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కొత్త పధకం ఇవాళ ప్రారంభం కానుంది.

ఏపీలో విద్యాశాఖలో ( Ap Education Department ) సమూల మార్పులు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్..పేద విద్యార్ధులకు సరైన వసతులు కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యాకానుక ( Jagananna Vidya kanuka Scheme ) పథకానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 5న ప్రారంభం కావల్సిన ఈ పథకం కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) కారణంగా ఆలస్యమైంది. ఇవాళ కృష్ణాజిల్లా పునాది పాడు ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇదే హైస్కూల్ లో చేపట్టిన నాడు నేడు పనుల్ని ముందుగా పరిశీలించి..అనంతరం విద్యార్దులకు విద్యాకానుక అందిస్తారు. 

జగనన్న విద్యాకానుక కిట్లలో ఉండేవి ఇవే..

ఈ కిట్లలో స్కూల్ బాగ్‌, మూడు జ‌త‌ల యూనిఫామ్స్‌, ఒక జ‌త బూట్లు, రెండు జ‌త‌ల సాక్సులు, బెల్టు, పాఠ‌పుస్త‌కాలు, నోట్‌బుక్స్ ఉంటాయి. విద్యార్థుల యూనిఫామ్స్‌కు అయ్యే టైలరింగ్ ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఖాతాలో జ‌మ చేయ‌నుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి వరకూ చదివే విద్యార్థులందరికీ ఈ పథకం ద్వారా ప్రత్యేక స్కూల్‌ కిట్లను అందజేయనున్నారు. రాష్ట్రంలో 42 లక్షల 34 వేల 322 మంది విద్యార్ధులకు ఈ పథకం ద్వారా లబ్ది చేరకూరనుంది. దాదాపు 650 కోట్ల ఖర్చుతో విలువైన కిట్లను విద్యార్ధులకు అందించనున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు గణనీయంగా పెంచడంతో పాటు విద్య నేర్చుకునే విషయంలో వారిలో ఉత్సాహం పెంచడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనేది ఏపీ ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇందులో భాగంగానే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. Also read: Supreme court: ఇంగ్లీషు మీడియంను వ్యక్తిగతంగా సమర్ధిస్తాం

 

Trending News