Anganwadi Posts in AP: మహిళలకు శుభవార్త.. త్వరలో 5,905 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీల కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5905 అంగన్‌వాడీ పోస్టుల (Anganwadi Posts in AP)ను భర్తీ చేసేందుకు సిద్ధమైంది.

Last Updated : Oct 6, 2020, 01:19 PM IST
  • ఏపీలో మహిళలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది
  • రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5905 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సిద్ధమైన ఏపీ సర్కార్
  • ఈ పోస్టులకు పదవ తరగతి కనీస విద్యార్హతగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది
Anganwadi Posts in AP: మహిళలకు శుభవార్త.. త్వరలో 5,905 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీల కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5905 అంగన్‌వాడీ పోస్టుల (Anganwadi Posts in AP)ను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. 4,007 అంగన్‌వాడీ హెల్పర్లు, 1,468 మెయిన్ అంగన్‌వాడీలలో వర్కర్ పోస్టులు, 430 మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టుల (Anganwadi Jobs in AP)ను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.  

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి కనీస విద్యార్హతగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తారు. కొన్ని జిల్లాల్లో ఇటీవల అంగన్‌వాడీ హెల్పర్లు, అంగన్‌వాడీ వర్కర్లను భర్తీ చేయడం తెలిసిందే. మెయిన్‌ అంగన్‌వాడీల్లో వర్కర్లకు రూ.11,500, మినీ అంగన్‌వాడీల్లో వర్కర్లుకు రూ.7 వేలు జీతం అందనుంది. అదే విధంగా హెల్పర్లకు కూడా రూ.7 వేల ఇస్తారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసి నిరుద్యోగుల సమస్యను పరిష్కరించారు. గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల పేరుతో సొంత ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా లక్షకు పైగా యువతకు ఉపాధి కల్పించారు. అంగన్‌వాడీల జీతాలను సైతం గతంలో పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరికొందరు మహిళలకు అంగన్‌వాడీలో ఉపాధి కల్పించనున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News