కరోనా వైరస్ ( Coronavirus ) వల్ల దుబయిలో ఈ ఏడాది జరగాల్సిన ఎక్స్ పో ( Dubai expo 2020 ) పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే దుబయి అధికారులు దీనిపై ఒక స్పష్టత ఇచ్చారు. ఈ ఎక్స్ పో వచ్చే ఏడాడి అక్టోబర్ 1 న ప్రారంభం అయి 2020 మార్చి 31 వరకు కొనసాగుతుంది అని తెలిపారు. వాస్తవానికి ఈ ఎక్స్ పో 2020 అక్టోబర్ 1 వ తేదీన ప్రారంభం అయిన... 2021 ఏప్రిల్ 20 వరకు కొనసాగాల్సి ఉంది. కానీ అంతర్జాతీయంగా కరోనావైరస్ వల్ల ఏర్పడిన లాక్ డౌన్ ( Lockdown ) వల్ల, వ్యాధి సంక్రమణను గమనించి పోస్ట్ పోన్ చేశారు.
ALSO READ| What Is Sonic Boom: ప్యారిస్ ను వణికించిన సోనిక్ బూమ్ అంటే ఏంటి ? ఎందుకలా జరిగింది ?
అంతర్జాతీయ ఎక్స్ పోజిషన్ బ్యూరో ఆధ్వర్యంగో దుబయి లో జరిగే అంతర్జాతీయ ఎక్స్ పోను నిర్వహించనున్నారు. ఈ ఎక్స్ పోను పోస్ట్ పోన్ చేయాల్సిందిగా అనేక దేశాలు దుబయితో పాటు అంతర్జాతీయ ఎక్స్ పోజిషన్ ను కోరాయి. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే ఏడాది జరిగే ఎక్స్ పో దుబయి ఎక్స్ పో 2020 అనే పేరుతో నిర్వహించనున్నారు. సుమారు 25 మిలియన్ల మంది ఈ ఈవెంట్ కు హాజరు అయ్యే అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు. మరో ఏడాది తరువాత ఈ ఎక్స్ పో జరగనుంది..
ALSO READ | Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు..
యూఏఈ ( UAE ) ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ ఈవెంట్ కు మంచి డిమాండ్ ఉంది అని దుబయి ఎక్స్ పో 2020 డైరక్టర్ బ్యూరో రీమ్ అల్ హాషిమీ తెలిపారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR