SP Balu and Venu Madhav dies on same date: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (sp balasubrahmanyam) ఇక లేరనే దుర్వార్త అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. బాలు పాడిన ఎన్నో వేల పాటలను తలుచుకుంటూ.. ఆయన అభిమానులందరూ మౌనంగా రోదిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిశాలకు ఎంజీఎం ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు నెలన్నర నుంచి కరోనా (Coronavirus)తో పోరాడిన గానగంధర్వుడు బాలు (SP Balu) చివరకు ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. అయితే టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో సెప్టెంబరు 25 బ్లాక్ డేగా గుర్తుండిపోనుంది. ఎందుకంటే బాలు ఒక్కరే ఆ రోజున కన్నుమూయలేదు. మరోక తెలుగు సుపరిచిత నటుడు కూడా అదేరోజు కన్నుమూశారు. సరిగ్గా ఏడాది క్రితం 2019 సెప్టెంబరు 25న టాలీవుడ్ హస్య నటుడు వేణు మాధవ్ (Venu Madhav) కూడా అనారోగ్య సమస్యలతో యశోదా ఆసుపత్రిలో కన్నుమూశారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో జన్మించిన వేణు మాధవ్ ఎన్నో దశాబ్ధాల పాటు తన కామెడీతో, మిమిక్రీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అయితే.. సెప్టెంబర్ 25న ఇద్దరు ప్రముఖులు కూడా మరణించడం యాధృచ్చికమే అయినా.. టాలీవుడ్ ఆ రోజున ఇద్దరు లెజెండరీ స్టార్లను కోల్పోయిందనేది అందరినీ కలిచివేస్తోంది. ఏదిఏమైనప్పటికీ సెప్టెంబరు 25 టాలీవుడ్లో బ్లాక్‌డేగా నిలిచిపోనుంది. Also read: SPB last rites: ఫామ్‌హౌజ్‌లో బాలు భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు
ఇదిలాఉంటే.. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మరణంతో మొత్తం సినీ పరిశ్రమ, ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరి కొద్ది సేపట్లో బాలు వ్యవసాయ క్షేత్రంలోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. అయితే తమ అభిమాన గాయకుడు బాలును చివరిసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు ఇప్పటికే ఆయన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటున్నారు. Also read : SP Balasubrahmanyam died: బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక తీరకుండానే..