Revanth Reddy open letter to CM KCR: హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ( Revanth Reddy to CM KCR ) ద్వారా ఘాటైన హెచ్చరికలు చేశారు. నాగులు ఆత్మహత్యాయత్నం ఘటనకు ( Nagulu suicide attempt issue ) దారితీసిన పరిస్థితులను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్‌కు ఘాటైన పదజాలంతో బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. అసెంబ్లీ సమీపంలో నాగులు ఆత్మహత్యాయత్నమే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. తెలంగాణలో పెరుగుతున్న నిరుద్యోగంపై అనేక సందర్భాల్లో అనేక పద్ధతుల్లో చెప్పి చూశామని.. కానీ మీ వైఖరి మాత్రం దున్నపోతుపై వర్షం కురిసినట్టే ఉందని సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. నాగులు ఆత్మహత్యాయత్నం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేసిన రేవంత్ రెడ్డి.. ఈ ఘటన తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన ఆత్మబలిదానాలను గుర్తుకు తెచ్చిందని అన్నారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తర్వాత నాగులు చేసిన ఆర్తనాదాలలో తెలంగాణ నిరుద్యోగ యువత ( Unemployed youth ) గుండె చప్పుడు ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నాగులు చేసిన ఆర్తనాదాలను నిరుద్యోగ యువత నినాదాలుగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) అభివర్ణించారు. Read also : AP: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ‘వైఎస్ఆర్ ఆసరా’ పథకానికి శ్రీకారం
నాగులు ఆత్మహత్యాయత్నం ఘటనపై సీఎం కేసీఆర్ ( CM Kcr ) స్పందించకపోవడం ఆయన కనికరం లేని, మానవత్వం లేని తత్వానికి తార్కాణం అని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ వైఖరి చూస్తోంటే.. నాడు యువత శవాల వద్ద కేసీఆర్ కార్చింది కన్నీరా, లేక ముసలి కన్నీరా ? అని రేవంత్ ప్రశ్నించారు. తాము చనిపోయినా.. తమ సోదరులకైనా ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో తెలంగాణ యువత ఉద్యమ సమయంలో ఆత్మబలిదానాలు చేసుకున్నారని.. కానీ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరి చూసి బలిదానాలు చేసుకున్న యువత ఆత్మలు ఘోశిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. Read also : Minister KTR: మైక్ ఇస్తే హీరోగిరి చేస్తామంటే నడవదు : కోమటిరెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్
ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ( Minister KTR ) సూటూబూటూ వేసుకుని గచ్చిబౌలిలో బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, టి హబ్ ద్వారా ఏదో సాధిస్తున్నామని గప్పాలు కొట్టుకోవడం తప్ప సాధించి ఏమీ లేదని మంత్రి కేటీఆర్‌ని ఎద్దేవా చేశారు. నాగులుకు మెరుగైన వైద్యం ప్రభుత్వమే అందించి ఉపాధికి హామీ ఇవ్వాలి అని డిమాండ్ చేసిన రేవంత్.. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం తక్షణమే కార్యచరణ రూపొందించి ముందుకు వెళ్లకపోతే.. నిరుద్యోగ యువత తరఫున త్వరలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్యమం చేస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. Read also : Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు
Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో రేవంత్ రెడ్డి హెచ్చరిక