తెలంగాణ సీఎంకు ఇవాంక ట్రంప్ లేఖ

ఛాన్స్ దొరికితే మరోసారి హైదరాబాద్ వస్తానంటున్న ఇవాంక ట్రంప్

Last Updated : Dec 19, 2017, 09:17 AM IST
తెలంగాణ సీఎంకు ఇవాంక ట్రంప్ లేఖ

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైట్ హౌస్ నుంచి ఓ లేఖ వచ్చింది. రాసింది ఎవరో కాదు..స్వయనా అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్.. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ వాణిజ్యవేత్తల సదస్సుకు ఆమెను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తను ఆహ్వానించినందుకు గాను  కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాంక ఈ లేఖ రాశారు. ఈ సందర్భంలో ఆమె స్పందిస్తూ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తనకు లభించిన ఆతిథ్యం, కానుకను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిన తీరు అనిర్వచనీయమని పేర్కొన్న ఇవాంకా.. అవకాశం దొరికితే మరోమారు హైదరాబాద్ వస్తానని లేఖలో పేర్కొన్నారు.

 

Trending News