అమరావతి: ఏపీ సర్కారు ( AP govt ) ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటైన జగనన్న విద్యా కానుక ప్రస్తుతానికి వాయిదా పడింది. వాస్తవానికి ముందస్తుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 5నే ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ సెప్టెంబరు 30 వరకు విద్యా సంస్థలు పునఃప్రారంభించరాదని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తెలిపారు. ఈ కారణంగానే జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అక్టోబర్ 5వ తేదీగా వాయిదా పడింది. Also read : AP: ఫుడ్ ప్రాసెసింగ్ పై 8 కంపెనీలతో ఎంవోయూలు
ఇదిలావుంటే, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టి సారించిన జగన్ సర్కార్.. నేడు నెదర్లాండ్ ప్రభుత్వంతో పాటు ( Netherlands govt) ఇతర సంస్థలతో కలిపి మొత్తం 8 ఎంవోయూలపై ( 8 MoUs ) సంతకాలు చేసింది. దీంతో ఏపీలో పండించే పలు వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఆక్వా ఫుడ్స్ ( Aqua foods ) ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడనుంది. Also read : Jagadishwar Reddy: మాజీ ఎమ్మెల్సీ మృతి
Jagananna Vidya kanuka: జగనన్న విద్యా కానుక పథకం వాయిదా