'షహీద్' అనే పదం మా నిఘంటువులో లేదు

ఆర్మీ, పోలీసు శాఖలలో 'అమరవీరుడు', 'షహీద్' అనే పదాలు లేవని కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖ తెలిపాయి.

Last Updated : Dec 16, 2017, 11:16 AM IST
'షహీద్'  అనే పదం మా నిఘంటువులో లేదు

ఆర్మీ, పోలీసు శాఖలలో 'అమరవీరుడు', 'షహీద్' అనే పదాలు లేవని కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖ తెలిపాయి. ఆర్మీలో ఎవరైనా చనిపోతే వారిని 'యుద్ధంలో చనిపోయినవారు' అని, పోలీసు శాఖలో ఎవరైనా చనిపోతే వారిని 'పోలీసు చర్యలలో చనిపోయినవారు' అని సంబోధిస్తామని కేంద్ర సమాచార శాఖ కమిషన్ కు తెలిపాయి.

'అమరవీరుడు', 'షహీద్' అనే పదాలను న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా అర్థాలు ఏమున్నాయో చెప్పాలని.. ఆ పదాలకు పరిమితులు, ఉచ్చారణలో తప్పులు దొర్లితే శిక్షలు, జరిమానాలు ఏమైనా ఉన్నాయో తెలపాలంటూ హోంశాఖకు ఒక సామాజిక కార్యకర్త విజ్ఞప్తి చేసాడు. కానీ ఎటువంటి సమాచారం అందకపోవడంతో చివరకు కేంద్ర సమాచార కమిషన్ ను ఆశ్రయించాడు.

Trending News