కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) రేసులో ముందంజలో ఉన్నామని రష్యా మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే వ్యాక్సిన్ కనుగొన్నామని ప్రకటించి సంచలనం రేపిన రష్యా)( Russia )..ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఉత్తత్తి కూడా పూర్తయినట్టు వెల్లడించింది.
కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో ఆ రేసులో ముందున్నామని ప్రకటించుకుంది. రష్యా. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ప్రకటించి సంచలనం రేపింది. రష్యా వ్యాక్సిన్ ప్రకటన విన్నవింటనే స్వాగతించిన దేశాలూ ఉన్నాయి..అనుమానాలు వ్యక్తం చేసిన దేశాలూ ఉన్నాయి. ఏదేమైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ ( Russia president putin ) మాత్రం ఆ వ్యాక్సిన్ ను తన కుమార్తెపైనే ప్రయోగించి సంచలనం రేపారు. ఇప్పుడు తాజాగా మరో సంచలనం రేపింది. తాము కనుగొన్న వ్యాక్సిన్ ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తి పూర్తయినట్టు రష్యా దేశపు ఇంటర్ ఫాక్స్ వార్త సంస్థ ప్రకటించింది. వాస్తవానికి వ్యాక్సిన్ మూడోదశ ( Vaccine 3rd phase trials ) ఆగస్టులో పూర్తవుతుందని రష్యా ఇటీవలే ప్రకటించింది. అది పూర్తవకుండానే ఉత్పత్తి చేయడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు స్పుత్నిక్ వి ( Sputnik v ) అని పేరు పెట్టడమే కాకుండా...ఎటువంటి దుష్పభావాలు కన్పించలేదని..పూర్తిగా సురక్షితమని దేశ ప్రజలకు రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir putin ) భరోసా ఇచ్చారు. Also read: Corona virus: కరోనా మళ్లీ వస్తుందా ? ఆందోళన కల్గిస్తున్నకొత్త లక్షణం