Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చికిత్సకు స్పందిస్తున్నారు

భారత మాజీ  రాష్ట్రపతి ( Ex-President ) ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) కోవిడ్-19 ( Covid-19 ) బారిన పడటంతో ఆయనకు చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 10న ఆయనకు ఆపరేషన్ నిర్వహించి మొదడులో ఉన్న కణితిని కూడా తొలగించారు వైద్యులు.

Last Updated : Aug 14, 2020, 01:30 PM IST
    1. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యంపై దేశ వ్యాప్తంగాఆందోళన
    2. చికిత్సకు స్పందిస్తున్నారు...
    3. వివరాలు తెలిపిన అభిజిత్ ముఖర్జీ
Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చికిత్సకు స్పందిస్తున్నారు

భారత మాజీ  రాష్ట్రపతి ( Ex-President ) ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) కోవిడ్-19 ( Covid-19 ) బారిన పడటంతో ఆయనకు చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 10న ఆయనకు ఆపరేషన్ నిర్వహించి మొదడులో ఉన్న కణితిని కూడా తొలగించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై దేశ వ్యాప్తంగా ఆందోళన కనిపిస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు దేశ ప్రజలు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ డిల్లీలోని ( Delhi ) ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయితే ఆయన ఆరోగ్యం విషయంలో దేశ వ్యాప్తంగా పలు నకిలీ వార్తలు చెలామణి అవుతుండటంతో ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ( Social Media ) వాస్తవాలను షేర్ చేస్తున్నారు.

తాజాగా ఆయన ఒక పోస్టు పెట్టారు. ఇందులో " 96  గంటల అబ్జర్వేషన్ పిరియెడ్ నేటితో ముగియనుంది. నా తండ్రి వైటల్ పారామీటర్లు స్టెబుల్ గా ఉన్నాయి. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు. ఈ దేశ ప్రజలకు నేను రుణపడి ఉంటాను అని.. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించండి"  రాశారు. 

 

Trending News