కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా ప్రపంచమంతా గజగజవణుకుతుంటే రష్యా ( Russia ) అందరికంటే ముందు శుభవార్త విన్పించి ఊరట కల్గిస్తోంది. తొలి కోవిడ్ 19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ను కనుగొన్నామని ప్రకటించడంతో ప్రపంచమంతా అటే చూస్తోంది. ఈ వ్యాక్సిన్ కోసం దేశాలు క్యూ కడుతున్నాయి.
రష్యా అభివృద్ధి చేసిన తొలి కోవిడ్ 19 వ్యాక్సిన్ ( First covid19 vaccine )కు స్పుత్నిక్ వి ( Sputnik v ) అని పేరు కూడా పెట్టారు. సెప్టెంబర్ నెల నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి ( Vaccine production from september ) ప్రారంభిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir putin ) ప్రకటించారు. స్పుత్నిక్ వి ( Sputnik v vaccine ) కు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు చెబుతామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 12 నుంచి వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాలు ప్రారంభమవుతాయని..సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని వ్యాక్సిన్ ప్రాజెక్టుకు ఆర్దిక సహాయం అందించిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ ( kirill Dmitriyev ) స్పష్టం చేశారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid 19 vaccine ) పై ప్రకటన చేసినప్పటి నుంచి ప్రపంచంలోని 20 దేశాలు ఇప్పటికే బిలియన్ కంటే ఎక్కువ ప్రీ ఆర్డర్లు చేశాయని కిరిల్ వివరించారు. Also read: Rare Animal in Western Ghats: అత్యంత అరుదైన జంతువిది..పేరేంటో తెలుసా
రష్యాలోని గామలేయా ఇనిస్టిట్యూట్ ( Gamaleya institute ) అభివృద్ది చేసిన తొలి వ్యాక్సిన్ ను తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఇచ్చినట్టు స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత తన కుమార్తె బాడీ టెంపరేచర్ స్వల్పంగా పెరిగి..తరవాత సాధారణ స్థాయికి చేరిపోయిందని పుతిన్ వివరించారు. టీకా ఇచ్చినప్పుడు 38 టెంపరేచర్ నమోదైందని...తరువాత 37కు తగ్గిందన్నారు. తమ దేశంలో ముందుగా ఈ వ్యాక్సిన్ ను వైద్య సిబ్బంది, ఉపాధ్యాయలకు అందిస్తామన్నారు. Also read: Survey on Schools Re open: స్కూల్స్ ప్రారంభించడానికి తల్లిదండ్రులు ఓకే అనేశారా?