Kerala govt: కొజికోడ్: కేరళలోని కొజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ( Air India flight crash-landing ) జరిగిన తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరూ క్వారంటైన్లోకి వెళ్లిపోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒకరికి కరోనావైరస్ ( Coronavirus) పాజిటివ్ అని తేలిందని, కావున సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా క్వారంటైన్లోకి వెళ్లిపోవాలని సూచించింది. మిగితా ప్రయాణికులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే పనిలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. Also read: Kozhikode Airport: ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలం తాజా దృశ్యాలు
సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్య మంత్రి శైలజ ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా క్వారంటైన్లోకి వెళ్లిపోవాలి.. వారందరికీ కోవిడ్ పరీక్షలు చేస్తాం.. స్వచ్ఛందంగా వారందరూ స్థానికంగా ఉండే ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలని ఆరోగ్య మంత్రి శైలజ ( Shailaja ) సూచించారు.
All those who were involved in rescue operations at Kozhikode Airport should go into self-quarantine. State Government to conduct #COVID19 tests of all: KK Shailaja, Kerala Health Minister (file pic) pic.twitter.com/Lldp3G7xwd
— ANI (@ANI) August 8, 2020
నిన్న కోజికోడ్ విమానశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై జారి రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ ప్రమాదంలో 20మందికి పైగా మరణించారు. అయితే వారిని రక్షించేందుకు స్థానికులు, పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది, ఆరోగ్యశాఖ, అదేవిధంగా పలుశాఖలు ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. Also read: Kozhikode flight crash: విమానం కూలిపోవడానికి ఈ 3 అంశాలే ప్రధాన కారణమా ?