కరీంనగర్ : కరోనావైరస్ ( Coronavirus ) సోకిందని తెలిసిన తర్వాత కూడా ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి మరో పది మందితో కలిసి పేకాట ఆడిన వైనం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్బాపూర్‌లో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల కరోనావైరస్ పరీక్షలు చేయించుకోగా అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐతే, అతడికి కరోనా లక్షణాలు తీవ్రంగా లేకపోవడంతో ఇంట్లోంచి బయటకు రాకుండా హోం క్వారంటైన్‌లోనే ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. Also read: Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు
హోం క్వారంటైన్లో ( Home quarantine ) ఉండాల్సిందిగా డాక్డర్లు హెచ్చరించినప్పటికీ.. సదరు కరోనావైరస్ పాజిటివ్ వ్యక్తి ఆ హెచ్చరికలను లెక్కచేయకుండా బుధవారం మరో పది మందితో కలిసి పేకాట ఆడిన తీరు స్థానికులను ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా పేషెంట్ పేకాట గురించి గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది సదరు వ్యక్తితో కలిసి పేకాట ఆడిన వారిని గుర్తించి వారిని కూడా హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ( Coronavirus symptoms ) కనిపిస్తే... వెంటనే జిల్లా కేంద్రంలోని కొవిడ్-19 ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాల్సిందిగా తెలిపారు. స్థానిక పోలీసులు సైతం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. Also read: IPL 2020: ఐపిఎల్ 2020లో అన్నీ సవాళ్లే: సురేష్ రైనా