బీసీసీఐ ( BCCI) ప్రపంచలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు దాని ఆదాయం ముందు ఐసీసీ ( ICC ) ఆదాయం కూడా వెలవెలబోతుంది. కానీ భారత క్రికెట్ బోర్డు మాత్రం గత పది నెలల నుంచి క్రికెటర్స్ కు జీతాలు ఇవ్వడం లేదట. తాజాగా ఒక వార్తా పత్రిక ప్రచురించిన బీసీసీఐ బ్యాలెన్స్ ( BCCI Balance Sheet ) షీట్ తో ఈ విషయం వెల్లడైంది. బీసీసీఐ క్రికెటర్లకు గత ఏడాది అక్టోబరు నుంచి జీతాలు ( Cricketers Salary ), మ్యాచు ఫీజులు ( Match Fee ) కూడా చెల్లించలేదట.
Read This Story Also: NRI Money: వాట్సాప్, ఈమెయిల్ తో ఇండియాకు డబ్బు పంపించే సదుపాయం
ఐపీఎల్ ( IPL ) వల్ల మాత్రమే ప్రతీ ఏడాది క్రికెట్ బోర్డుకు సుమారు రూ.2 వేల నుంచి రూ.4 వేల కోట్లు ఆదాయం వస్తుంది. ఇంత సంపాదిస్తున్నా బీసీసీఐ కాంట్రాక్టులో (Players In BCCI Contract ) ఉన్న 27 మంది క్రికెటర్లకు జీతాలు చెల్లించడపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. టీమ్ ఇండియా ( Team India ) ప్రతీ టెస్టు క్రికెట్ మ్యాచుకు రూ.15 లక్షలు, వన్డే మ్యాచుకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచుకు రూ.3 లక్షలు చెల్లిస్తుంది. 2019లో టీమ్ ఇండియా ఆడిన మ్యాచుల్లో రెండు టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20 మ్యాచులకు క్రీడాకారులకు డబ్బు అందలేదు. దీంతో బీసీసీఐ మొత్తం రూ.99 కోట్లు చెల్లించాల్సి ఉంది.
Read This Story Also: IPL 2020 FANS: క్రికెట్ అభిమానులకు శుభవార్త