ట్విట్టర్ చరిత్రలోనే సంచలనం సృష్టించిన ఘటన ఇటీవల జరిగిన ట్విటర్ హ్యాకింగ్. ట్విటర్ హ్యాకింగ్ ఘటనపై అంతర్గత విచారణ చేపట్టిన ఆ సంస్థ.. అత్యంత భద్రతా వ్యవస్థ కలిగిన ట్విట్టర్ సర్వర్స్‌ని ఎలా హ్యాక్ చేయగలిగారనే కోణంలో దర్యాప్తు జరిపి ఓ నిర్ధారణకు వచ్చింది. అదేంటంటే... ప్రముఖుల ట్విటర్ ఎకౌంట్స్ హ్యాక్ చేయడానికంటే ముందుగా హ్యాకర్స్ ట్విటర్ ( Twitter hackers ) సిబ్బందికి ఫోన్ చేయడం ద్వారా ట్విటర్ సిస్టమ్స్‌లోకి ప్రవేశించారని సంస్థ గుర్తించింది. ఫోన్ స్పియర్ ఫిషింగ్ ( phone spear phishing attack) ద్వారా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు ట్విట్టర్ అంతర్గత దర్యాప్తులో తేలింది. ఫోన్ స్పియర్ ఫిషింగ్ ద్వారా హ్యాకర్లు ట్విటర్ సిబ్బందిని తప్పుదోవ పట్టించి హ్యాకింగ్‌కి సులువైన క్రెడెన్షియల్స్ కొట్టేశారని ట్విట్టర్ వెల్లడించింది. Also read: Bank Holidays: ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఎలోన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. బిట్ కాయిన్ కుంభకోణంతో ( Bitcoin scam) కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. Also read: Telegram: వాట్సాప్‌ని తలదన్నేలా టెలిగ్రామ్ కొత్త ఫీచర్స్