మెగాస్టార్ అల్లుడు ఇండస్ట్రీలోకి వస్తున్నాడా..?

రాకేష్ శశి దర్శకత్వంలో త్వరలో కళ్యాణ్‌ను హీరోగా పెట్టి నిర్మాత సాయి కొర్రపాటి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

Last Updated : Dec 8, 2017, 03:01 PM IST
మెగాస్టార్ అల్లుడు ఇండస్ట్రీలోకి వస్తున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కనుగంటి కళ్యాణ్ (ఇటీవలే శ్రీజను వివాహం చేసుకున్న వ్యక్తి) హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. రాకేష్ శశి దర్శకత్వంలో త్వరలో కళ్యాణ్‌ను హీరోగా పెట్టి నిర్మాత సాయి కొర్రపాటి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే సోషల్ మీడియాలో సైతం కళ్యాణ్‌కు సంబంధించిన పలు స్పెషల్ స్టిల్స్  హల్చల్ చేస్తుండడంతో.. ఆయన హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం కన్ఫర్మ్ అని భావిస్తున్నారు మెగా అభిమానులు.

అయితే ఈ విషయంపై అటు మెగా ఫ్యామిలీ నుండి గానీ, అటు కళ్యాణ్ వైపు నుండి గానీ ఇంకా ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. ఒకవేళ చిరు అల్లుడు కూడా హీరోగా పరిశ్రమలోకి వస్తే..  మెగా హీరోల జాబితాలో మరో కొత్త పేరు కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌‌గా మారుతుందనడంలో సందేహం లేదు. 

Trending News