డ్యాన్స్‌తో దుమ్మురేపుతున్న Covid19 పేషెంట్స్

COVID19 Positive Patients Dance |  కరోనా సోకిందని తెలియగానే కంగారు పడనక్కర్లేదు. మునుపటిలా ఎంతో ఉత్సాహంగా ఉండాలని, అప్పుడు వైరస్ మహమ్మారిని జయించవచ్చునని కొన్ని కోవిడ్19 కేంద్రాలు వారిలో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి.

Last Updated : Jul 20, 2020, 12:57 PM IST
డ్యాన్స్‌తో దుమ్మురేపుతున్న Covid19 పేషెంట్స్

కరోనా వైరస్ (CoronaVirus) సోకిందని తెలియగానే వారిని ఏదోలా చూస్తున్నారని కొందరు కోవిడ్19 లక్షణాలు కనిపించినా టెస్టులు చేయించుకోవడం లేదు. అయితే ఎంత త్వరగా కరోనా టెస్టులు చేయించుకుని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాలు కాపాడుకుని, కుటుంబాన్ని రక్షించుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వస్తే మాత్రం అయ్యేదేమీ లేదని, ఎప్పటిలాగే జోష్ కనిపించాలని వినూత్న ప్రయత్నాలు మొదలయ్యాయి. కోవిడ్19 కేంద్రాలు కరోనా పేషెంట్లలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి.  COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే

కర్ణాటకలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. బళ్లారిలోని ఓ కోవిడ్19 కేంద్రంలో లక్షణాలు లేకుండా కరోనా సోకిన పేషెంట్లు ఇటీవల చేరారు. అయితే వీరిలో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి, మానసిక స్థైర్యాన్ని నింపేందుకు కోవిడ్ కేంద్రం వినూత్నంగా ఆలోచించింది. ఒత్తిడిని జయించేందుకు, మీరు పేషెంట్లు అనే ఆలోచన మనసు నుంచి తొలగించుకునేందుకు డ్యాన్స్ (COVID19 Patients Dance) చేయిస్తున్నారు. Covid-19: భారత్‌లో 11 లక్షలు దాటిన కరోనా కేసులు 

బళ్లారిలోని ఓ కోవిడ్19 కేంద్రంలో లక్షణాలు లేని కరోనా సోకిన పేషెంట్లు నటుడు ఉపేంద్ర సినిమాలోని పాటకు స్టెప్పులు వేస్తూ ఆదివారం చాలా హుషారుగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూస్తే వీళ్లు కరోనా పేషెంట్లేనా అనే అనుమానం రాక మానదు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Trending News