Gold Price: పెరిగిన బంగారం ధర.. రికార్డు ధరకు వెండి

బంగారు కొనుగోలుదారులకు చేదువార్త. బంగారం ధర (Gold Rate Today) మరోసారి కొండెక్కింది. మరోవైపు వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలను నమోదు చేస్తున్నాయి. ఓ రకంగా చూస్తే తులం బంగారం ధరకు కేజీ వెండి ధర పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jul 14, 2020, 07:45 AM IST
Gold Price: పెరిగిన బంగారం ధర.. రికార్డు ధరకు వెండి

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా మూడోరోజు పెరిగాయి. బంగారం బాటలోనే వెండి పయనించింది. నేడు హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.60 మేర బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,960కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,240 అయింది. Vizag: ఫార్మా సిటీలో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన విశాఖ

ఢిల్లీలో మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ పెరిగింది. రూ.40 మేర స్వల్పంగా పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,050అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర పెరగడంతో 10 గ్రాములు రూ.47,850కి పెరిగింది.   వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

నేడు బంగారం బాటలోనే వెండి పయనించింది. అయితే బులియన్ మార్కెట్ చరిత్రలో రికార్డు ధర నమోదు చేసింది. మార్కెట్‌లో వెండి ధర రూ.210 మేర భారీగా పెరిగింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.52,210 అయింది. బులియన్ మార్కెట్‌లో తొలిసారిగా వెండి 52 వేల 200 మార్క్ చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.   RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News