న్యూఢిల్లీ: భారత్ విషయంలో నేపాల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌కి చెందిన న్యూస్ ఛానెళ్లను ( Indian news channels ) నేపాల్ కేబుల్ టీవీ ఆపరేట్స్ నిలిపేశారు. దూరదర్శన్ ( Doordarshan ) మినహా భారత్‌కి చెందిన మిగతా అన్ని న్యూస్ చానెళ్లను నేపాల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ నిలిపేశారు. భారత్‌కి చెందిన టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపేస్తున్నట్లు అక్కడి కేబుల్ ఆపరేటర్లు ( Nepal cable tv operators ) ప్రకటించారు. భారతీయ టీవీ ఛానెల్స్ ప్రసారాలను నిలిపేయాల్సిందిగా నేపాల్ సర్కార్ ( Nepal govt ) నుంచి అధికారికంగా ఆదేశాలు అందనప్పటికీ.. తామే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని నేపాల్ కేబుల్ ఆపరేటర్స్ తెలిపారు. ఈ మేరకు వారు ఏన్ఐకి వివరాలు వెల్లడించారు. ( Also read: IPL 2020: ఐపిఎల్ 2020 నిర్వహణపై స్పందించిన న్యూజిలాండ్ )
నేపాల్‌లో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై నేపాల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి డా యువరాజ్ ఖతివాడ ( Dr Yubaraj Khatiwada ) స్పందిస్తూ.. నేపాల్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా, నేపాల్ ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా నేపాల్‌కి వ్యతిరేకంగా ప్రసారాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ఇది పొరుగుదేశాలకు చెందిన టీవీ ఛానెళ్లకు కూడా వర్తిస్తుందని ఖతివాడ అన్నారు. ( Also read: Android 11 update: ఆండ్రాయిడ్ 11 రిలీజ్ డేట్, స్మార్ట్ ఫీచర్స్ ఇవే )
చైనా ( China ) చెప్పుచేతల్లో నేపాల్ ఉన్నందువల్లే అక్కడ భారత్‌కి వ్యతిరేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని భారతీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నేపాల్‌లో భూకంపం ( Nepal earthquake ) సంభవించినప్పుడు నేపాల్‌కి భారత్ అండగా నిలిచి ఎంతో సహాయం చేసిందని.. నేపాల్ ఆ విషయాన్ని మరువొద్దని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..