/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Priyanka Gandhi Vadra: న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) ఢిల్లీలోని  ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (  Ministry of Housing and Urban Affairs ) నోటీసులు జారీ చేసింది. ఒకవేళ నెలలోపు బంగ్లాను ఖాళీ చేయకపోతే జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. ప్రియాంక గాంధీ లోథి రోడ్‌లోని ప్రభుత్వ బంగ్లా నంబర్ -35 ను ఆగస్టు ఒకటి నాటికి ఖాళీ చేయడంతోపాటు అద్దె బాకాయిలను సైతం చెల్లించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం Z+ భద్రత ఉన్నవారికి ప్రభుత్వ బంగ్లా కేటాయించడం తప్పనిసరి కాదని పేర్కొంది. (Also read: PM Modi quits Weibo: చైనాకు పీఎం మోడీ మరో ఝలక్)

ఎస్పీజీ భద్రత లేకపోవడం వల్లనే..  
వాస్తవానికి ప్రియాంక గాంధీ వాద్రాకు 21.02.1997న లోథి ఎస్టేట్‌లోని బంగ్లా నంబర్ -35ను ఎస్పీజీ సెక్యూరిటీ కింద కేటాయించారు. అయితే ప్రియాంక గాంధీకి ఇచ్చిన ఎస్పీజీ (SPG) భద్రతను గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  రికార్డుల ప్రకారం.. ప్రియాంక గాంధీ జూన్ 30, 2020 వరకు రూ.3,46,677 రూపాయల అద్దె బకాయిలు చెల్లించాలని మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది.  బంగ్లాను ఖాళీ చేసే నాటికి అద్దెను కూడా చెల్లించాలని స్పష్టంచేసింది. (Akso read: 
Galwan Valley clash: ప్రధాని మోదీపై ధ్వజమెత్తిన రాహుల్..)

క్యాబినెట్ కమిటీ హౌసింగ్‌ సమావేశంలో నిర్ణయం.. 
క్యాబినెట్ కమిటీ హౌసింగ్ (CCA) సమావేశంలో 07.12.2000 న జరిగిన ప్రభుత్వ భూములు, గృహాల కేటాయింపు మార్గదర్శకాలను ఈ మేరకు సమీక్షించింది.  ఎస్పీజీ భద్రతలో ఉన్న వారికి తప్ప, ఏ ప్రైవేట్ వ్యక్తికి భవిష్యత్తులో ప్రభుత్వ భవనాలను ఇవ్వకూడదని సమావేశంలో నిర్ణయించారు.  ఇలాంటి వాటిని మార్కెట్ రేటు ప్రకారం కేటాయించాల్సి ఉంది. ఇది సాధారణ ఛార్జీల కంటే 50 రెట్లు ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ భవనాల్లో ఉంటున్న వారికి మినహాయింపు కూడా ఉంటుంది. భద్రతా పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని సీసీఏ సిఫారసుల మేరకు హోం మంత్రిత్వ శాఖ వీటి కేటాయింపులు చేపడుతుంది.  
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Section: 
English Title: 
Centre cancelled government bungalow allotted to Priyanka Gandhi Vadra
News Source: 
Home Title: 

ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీకి నోటీసు

ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీకి నోటీసు
Caption: 
ANI
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీకి నోటీసు
Publish Later: 
No
Publish At: 
Wednesday, July 1, 2020 - 22:00